గర్భిణీలకు ఇది ఒక దివ్యౌషధం...అదెంటో తెలుసా

శరీరంలో వచ్చే సమస్యకైనా, మానసిక సమస్యకైనా.....అన్నింటికీ ఒక దివ్యౌషధం ఉంది. దానివల్ల అన్ని అనారోగ్య సమస్యలు ఇట్టే పోతాయి. కాకపోతే ఆచితూచి వ్యవహరించాలి. ఏ మాత్రం గాడితప్పినా.....రియాక్షన్ తప్పదు.

గర్భిణీలకు ఇది ఒక దివ్యౌషధం...అదెంటో తెలుసా


శరీరంలో వచ్చే సమస్యకైనా, మానసిక సమస్యకైనా.....అన్నింటికీ ఒక దివ్యౌషధం ఉంది. దానివల్ల అన్ని అనారోగ్య సమస్యలు ఇట్టే పోతాయి. కాకపోతే ఆచితూచి వ్యవహరించాలి. ఏ మాత్రం గాడితప్పినా.....రియాక్షన్ తప్పదు.ఇంతకీ అదేంటీ అనుకుంటున్నారా....అదేనండి ఎక్సర్‌సైజ్‌. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఈ వ్యాయామాలు దర్జాగా చేసుకోవచ్చు. మన శరీర పరిస్థితి బట్టి చేసుకోవాలి. వీలుంటే నిపుణుల సలహా మేరకు చేయోచ్చు.



అప్పట్లో గర్భిణీలకు సుఖ ప్రసవం సులువుగా జరిగిపోయేది. ఎందుకంటే గతంలో మహిళలు ఇంటిపని, వంటపని, బయటపని చేసుకునేవాళ్లు. పురిటినొప్పులు వచ్చేదాకా కూడా పనులు చేస్తూనే ఉండేవారు, కూర్చోవడం, లేవడం వంటి పనుల వల్ల.....ఏమాత్రం భయం లేకుండా ప్రసవం జరిగిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి చిన్నపని ఆటోమేటిక్‌ అయిపోయింది. కూర్చోనే అన్ని పనులు చేసేస్తున్నారు. అన్నింటికీ స్విచ్చులు, అన్నింటికీ యంత్రాలు....జీవితంలో భాగమైపోయాయి. పల్లెల్లో కూడా అలవాటైపోయింది. కాబట్టి మహిళలకు ప్రసవం కూడా కష్టమైపోయింది. ప్రసవం అంటే ఇంక కోసేయడమే. కోసి తీసేయడమే. పురిటినొప్పులు పడకుండానే పిల్లలను కనేస్తున్నారు. కానీ దానివల్ల ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి

అందుకే ఇప్పుడు గర్భిణీలు కూడా కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకు చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాలు చేస్తూ సుఖ ప్రసవం కోసం కష్టపడుతున్నారు. గతంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా గర్భం దాల్చినప్పుడు....నిపుణుల సలహాతో వ్యాయామాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.  


నిజానికి తేలికపాటి వ్యాయామాలు సుఖ ప్రసవానికి తోడ్పడతాయి. కటి కండరాలు, ఎముకలు బలపడి ప్రసవం తర్వాత కోలుకునే సమయాన్నీ తగ్గిస్తాయి. ఇప్పుడు చాలా ఆస్పత్రుల్లో వైద్యులే వ్యాయామాలు చేయిస్తున్నారు. ఈ వ్యాయామాలు శిక్షకుల సాయంతో చేయాలి. ప్రసవానంతరం రొమ్ముల తీరు కుదురుగా ఉండడం కోసం, ఆ ప్రదేశంలోని కండరాలు సాగిపోకుండా ఉండడం కోసం గర్భిణిగా ఉన్నప్పటి నుంచే ఈ వ్యాయామాల చేయాలి. గర్భంతో పొట్టలో కొవ్వు పేరుకుంటోందని భయపడే మహిళలకు ఈ వ్యాయామం ఓ ఊరట. ప్లాంక్‌ను పోలిన వ్యాయామంతో పొత్తికడుపు దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.

పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఒక సమయాన్ని పెట్టుకుని దగ్గర్లో ఉండే పార్క్ కి గాని, ఖాళీ ప్రదేశంలో కాని కొద్దిగా నడవాలి. వంగకుండా ఉండే చిన్న చిన్న పనుల్లాంటివి చెయ్యాలి. కానీ ఊళ్లో వాళ్లైనా, నగరాల్లో ఉండేవాళ్లయినా కామన్‍గా చేయకూడనివి మెట్లు ఎక్కడం, ఎక్కువసేపు వంగుని ఉండడం, గెంతడం, బరువులు ఎత్తడం. తినే ఆహారంలో నూనె పదార్థాలు ఎక్కువ లేకుండా పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇలా జాగ్రత్త పడకపోతే శరీరం కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువుంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.