జింజర్ ఆయిల్‌తో జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది తెలుసా..?

జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా చేసి జుట్టును బాగా పెరిగేలా చేయ‌డంలో మ‌న‌కు కెరాటిన్ అనే ప్రోటీన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే జుట్టుకు కెరాటిన్ అందేలా చూసుకుంటే చాలు.. దీంతో జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు.

జింజర్ ఆయిల్‌తో జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది తెలుసా..?
Benefits of ginger oil


నలుగురు ఆడవాళ్లు ఒక దగ్గర కుర్చుంటే వాళ్లు మాట్లాడుకునే మెదటి టాపిక్‌ జుట్టు గురించే ఉంటుంది. గాసిప్స్‌ ఎలాగూ ఉంటాయనుకోండి. ఏంటో ఈ మధ్య తెగ జుట్టు ఊడిపోతుందని ఒకరి తర్వాత ఒకళ్లు స్టాట్‌ చేస్తారు. ఆమె ఆ ఆయిల్‌ వాడుతుందట, వాళ్లు ఏవేవో ఆకులు వేసి తలకు పెట్టుకుంటారట అని చెప్పుకుంటారు. జుట్టు పెంచుకోవడం అనేది మనకు ఒక పెద్ద సవాల్‌గా మారిపోయింది. ఇది కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంది. ఈరోజుల్లో చాలా మంది అబ్బాయిలకు ఫోర్‌హెడ్‌ మీద జుట్టులేక అది వెనక్కుపోయి నానాతంటాలు పడుతున్నారు. ముందు అరఎకరం పోయిందని మళ్లీ కమెంట్స్‌. స‌రైన పోష‌ణ ల‌భిస్తే జుట్టు ఎంతో బాగా పెరుగుతుంది. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా చేసి జుట్టును బాగా పెరిగేలా చేయ‌డంలో మ‌న‌కు కెరాటిన్ అనే ప్రోటీన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే జుట్టుకు కెరాటిన్ అందేలా చూసుకుంటే చాలు.. దీంతో జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు. అలాగే జుట్టు కూడా పెరుగుతుంది. మ‌రి కెరాటిన్ అందాలంటే ఏం చేయాలి.. అంటే.. అందుకు జింజ‌ర్ ఆయిల్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు. దీంతో జుట్టుకు అధిక మోతాదులో కెరాటిన్ ల‌భిస్తుంది. ఇది జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది. ఇక జింజ‌ర్ ఆయిల్‌ను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

జింజ‌ర్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కొబ్బ‌రినూనె క‌లిపి జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా ప‌ట్టించాలి. 30 నిమిషాలు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం 2 సార్లు చేయండి. దీంతో జింజ‌ర్ ఆయిల్ జుట్టు పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది. జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తుంది. ఇక దీంతోపాటు ప‌లు ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. పుచ్చ గింజలు, పప్పులు, వేరుశనగలు, సోయా, ప‌నీర్‌, బాదంపప్పు, జీడిప‌ప్పు, వాల్ న‌ట్స్‌.. ఇలా ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు ప‌లు పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డ‌తాయి. క‌నుక ఈ సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు లేకుండా చూసుకోవ‌చ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.