Pregnancy : తల్లి అయ్యేందుకు ఓ సమయం ఉందని తెలుసా..!
ఈరోజుల్లో చాలామంది మహిళలు కెరీర్ పైన ఫోకస్ పెట్టి పెళ్లి పిల్లలు వంటి వాటిని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు అయితే తల్లి అయ్యేందుకు Time to become mother ఒక వయసంటూ ఉందని చెబుతున్నారు నిపుణులు..

Pregnancy : ఈరోజుల్లో చాలామంది మహిళలు కెరీర్ పైన ఫోకస్ పెట్టి పెళ్లి పిల్లలు వంటి వాటిని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు అయితే తల్లి అయ్యేందుకు Time to become a mother ఒక వయసంటూ ఉందని చెబుతున్నారు నిపుణులు..
పెళ్లి, పిల్లలు విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు.. కెరీర్ లో ఎదగాలి అనుకునేవారు కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని వాయిదా వేస్తారు మరి కొందరు మాత్రం చక్కని కుటుంబాన్ని ఏర్పరచుకొని అప్పుడు కెరీర్ పైన ఫోకస్ పెట్టొచ్చు అనుకుంటారు.. అయితే మారిపోతున్న ఆరోగ్యం అలవాట్లతో ఆడవారి ఆరోగ్యం ప్రభావం అవుతుంది.. అయితే, 25 నుంచి 35 ఏళ్ల మధ్య తల్లి కావడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అలాగే 35ఏళ్ల తర్వాత తల్లికావడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తుంది..
32ఏళ్ల తర్వాత ఈ సంఖ్య మరింత పడిపోతుందని తెలుస్తుంది.. అలాగే పిల్లలకు జన్మనివ్వడం మహిళలకు రెండో జన్మ లాంటిది. ఈ సమయంలో మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. అయితే మరీ చిన్న వయస్సులో కూడా పిల్లలను కనకూడదు. అదేసమయంలో వయసు పైబడే వరకూ ఆగకూడదు అని తెలుస్తుంది.. అలాగే వయస్సు పెరిగేకొద్దీ అండాల సంఖ్య తగ్గడంతోపాటు అండాల్లోని డీఎన్ఏ, క్రోమోజోమ్‌ల నాణ్యత కూడా తగ్గిపోతుందని.. అందుకే వీలైనంత తొందరగా పిల్లలకు జన్మనివ్వడం ఉత్తమమైన మార్గమని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు..