అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారమెంటో తెలుసా?

ప్రకృతి మనకు అనేక రకాల ఆహార పదార్థాలు అందిస్తోంది. పండ్లు, కూరగాయలు, దుంపలు, ఆకు కూరలు, అనేక రకాల చిరుధాన్యాలను ఇస్తుంది. వాటితో పాటే మాంసం, చేపలు, గుడ్లు.ఇవన్నీ ప్రకృతి ప్రసాదించినవే. వీటన్నింటినీ బాగా తింటున్నాం.

అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారమెంటో తెలుసా?


ప్రకృతి మనకు అనేక రకాల ఆహార పదార్థాలు అందిస్తోంది. పండ్లు, కూరగాయలు, దుంపలు, ఆకు కూరలు, అనేక రకాల చిరుధాన్యాలను ఇస్తుంది. వాటితో పాటే మాంసం, చేపలు, గుడ్లు...ఇవన్నీ ప్రకృతి ప్రసాదించినవే. వీటన్నింటినీ బాగా తింటున్నాం. కొందరు శాకాహారమే తింటే....మరికొందరు 2 బ్యాలెన్స్‌ చేస్తూ శాకాహారం, మాంసాహారం తింటూ ఉంటారు.

What are essential nutrients? What they are, what they do & how to get  enough - WellTuned by BCBST

అయితే వీటన్నింటితో పోలిస్తే....గింజధాన్యాల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఎక్కువ లాభం ఉంది. ఎందుకంటే....అన్ని రకాల కూరగాయల్లోనూ ఒకేలాంటి పోషకాలు ఉండవు. ఇప్పుడు శరీరానికి పిండిపదార్థాలు, విటమిన్లు, మాంసకృత్తులు, ప్రోటీన్స్‌, పీచుపదార్థాలు కావాలి. కానీ ఇవన్నీ అన్ని కూరగాయలు, ఆహారాల్లో ఉండవు. సాధారణంగా మాంసాహారంలో కేవలం మాంసకృత్తులే ఉంటాయి. శాకాహార పదార్థాల్లో ఒక్కో దాంట్లో ఒక్కో రకం పోషకాలు, విటమిన్లు ఉంటాయి. కూరగాయల్లో ఉన్నవి....ఆకుకూరల్లో ఉండవు. వీటిలో ఉండేవి....పండ్లలో ఉండవు.

మరి అన్నిరకాలు ఉండే ఆహారం పదార్థం ఏంటీ అంటే....ప్రకృతి ఇచ్చిన గింజధాన్యాలు. సమృద్ధిగా ఉంటాయి. అలా ఎందుకు అంటే.....మొక్కలు గానీ చెట్లు గానీ ఎదగాలంటే వాటికి విత్తనం కావాలి. విత్తనం అంటే గింజలని అర్థం. తన మనుగడను కొనసాగించేందుకు....చెట్టులో ఉండే అన్ని రకాల సారాన్ని....గింజల్లో ఉంచుతుంది. తాను ఎదిగి.....ఆ శక్తినంతటినీ విత్తనాల్లోకి పంపించేస్తుంది. అప్పుడు ఆ చెట్టు విరిగిపోయినా, కూలిపోయినా....విత్తనం మాత్రం మిగిలిపోతుంది. దానివల్ల చెట్టువిరిగిపోయినా.....మళ్లీ చెట్టు పెరుగుతుంది. ఇప్పుడు అంత పెద్ద మర్రిచెట్టు సారం.....ఇంత చిన్న విత్తనంలో దాగి ఉంది. ఉదాహరణకు.....మన కావాల్సిన జ్ఞానమంతా అప్పుట్లో పుస్తకాల్లో ఉండేది. మరి ఇప్పుడు చిన్న సైజులో ఉండే మెమోరీ కార్డులో నిక్షిప్తమైపోతుంది.

11 Essential Nutrients Your Body Needs Now - Dr. Axe

ఇంకో ముఖ్యమైన ఉదాహరణ చూస్తే.....ఒక మనిషి పుట్టాలంటే పిండం కావాలి. మరి ఆ పిండం ఎలా వృద్ధి చెందుతుంది? మగవారిలోని ఒక చిన్న వీర్యకణం, ఆడవారిలోని ఒక చిన్న అండం కలిస్తేనే.....మనిషి మనుగడ సాధ్యం. ఇంతటి విజయాలు సాధిస్తున్న మనిషే....ఒక చిన్న కణం ద్వారా ఉద్భవిస్తాడు. అదే విధంగా ఒక చిన్న గింజలో ఎన్నో వేల పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి.

కాబట్టి ఏవీ తిన్నా, తినకపోయినా గింజధాన్యాలు తింటే....శరీరానికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. సాధారణంగా పెసలు, మినుములు, రాగులు, సజ్జలు పండినప్పుడు పచ్చిగా ఉంటాయి. వాటిని అలానే తినేయవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే...ఎండబెట్టుకోవాలి. ఎండబెడితే దానిపైన ఉండే తొక్క గట్టిపడుతుంది. అప్పుడు తినడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మళ్లీ వాటిని నానబెట్టుకుని తినాలి. మొలకలు వస్తే ఇంకా శరీరానికి మంచిది. కొన్నిసార్లు చేతివేళంతా సైజులు పెరుగుతాయి. దాంట్లో కూడా ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి.

కొంతమంది వీటిని తింటే కడుపులో గ్యాస్‌ ఫామ్‌ అయిపోతుంది అంటారు. ఎందుకంటే వాటిలో ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి గ్యాస్‌ పేరుకుపోతుంది. అయితే సరిగ్గా నీళ్లు తాగక, సరిగ్గా మోషన్‌కు వెళ్లకపోతే...గ్యాస్‌ ఫామ్‌ అయిపోతుంది. సరైన సమయానికి నీళ్లు తాగి, మోషన్‌కు వెళ్తే ఎలాంటి సమస్య ఉండదు. అన్నం, చపాతీలు, వెజిటెబుల్‌ జ్యూస్‌లు కంటే...ఇవి వేల రెట్లు నయం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.