అల్లం టీ అతిగా తాగితే ఆ ఇబ్బందులు తప్పవట..!

చలికాలంలో ఎక్కువగా అల్లం టీ ని తీసుకోవడానికి ఇష్టపడతారు సాధారణంగా అల్లం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే పలు రకాల సమస్యల నుంచి దూరం చేస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ముందుంటుంది

అల్లం టీ అతిగా తాగితే ఆ ఇబ్బందులు తప్పవట..!
Ginger tea


చలికాలంలో ఎక్కువగా అల్లం టీ ని తీసుకోవడానికి ఇష్టపడతారు సాధారణంగా అల్లం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే పలు రకాల సమస్యల నుంచి దూరం చేస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ముందుంటుంది అందుకే చలికాలంలో వేడి ప్రభావం కోసం అల్లం టీ తాగుతూ ఉంటారు ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట నిజమే అయినప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.. 

చలికాలంలో దగ్గు శ్వాస కోసం సంబంధిత సమస్యలను తగ్గించడంలో ముందుంటుంది అల్లం టీ అందుకే దీన్ని తరచూ తీసుకుంటూ ఉంటారు.. అజీర్తిని తగ్గించడంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో ముందుంటుంది అల్లం టీ.. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది అయితే దీనిని అతిగా తీసుకుంటే మాత్రం కొన్ని ప్రమాదాలు తప్పవు అవి ఏంటంటే..

అల్లం టీ అధికంగా తీసుకోవడం వల్ల రక్తం పలుచబడే అవకాశం ఉందని తెలుస్తోంది ముఖ్యంగా అల్లం టీలో ఉండే లెసన్ రక్తపోటును తగ్గించేందుకు పనిచేస్తుంది రోజుకి ఐదు గ్రాములకు మించి అల్లం తీసుకుంటే మాత్రం రక్తం పరచబడి సమస్యలు వస్తాయని తెలుస్తోంది..

Tips to Lose Belly Fat Easily, Naturally, Home Remedies – Health Beauty ...

అల్లం టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే మాట నిజమే అయినప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం కడుపులో మంట, చాతిలో మంట వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు తలెత్తడంతో పాటు ఎక్కువగా తీసుకున్న తర్వాత మసాలా సంబంధిత పదార్థాలు తీసుకుంటే మాత్రం జీర్ణాశయంలో సమస్యలు తలెత్తుతాయి.. 

గర్భిణీలు అప్పుడప్పుడు అల్లం టీ తీసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు అయితే అతిగా తీసుకుంటే మాత్రం కడుపులో నొప్పితో పాటు పిండంపైన ప్రభావం పడే అవకాశం కూడా ఉంది..

అల్లం టీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అందుకే ఎవరికైతే రక్తంలో చక్కెర స్థాయిలో తక్కువగా ఉంటాయో అలాంటివారు అలా అని అతిగా వినియోగించడాన్ని తగ్గించాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.