పురుషులు ఈ ఆహారాలు తింటే అందంగా కనిపిస్తారట...!

అందం మీద అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా శ్రద్ధ ఉంటుంది. కాకపోతే వీళ్లు పెద్దగా పట్టించుకోరు.. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చాక.. అబ్బాయిలు కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. హెయిర్‌ స్టైల్‌,

పురుషులు ఈ ఆహారాలు తింటే అందంగా కనిపిస్తారట...!


అందం మీద అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా శ్రద్ధ ఉంటుంది. కాకపోతే వీళ్లు పెద్దగా పట్టించుకోరు.. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చాక.. అబ్బాయిలు కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. హెయిర్‌ స్టైల్‌, గడ్డం అన్నీ పక్కాగా మెయింటేన్‌ చేస్తున్నారు. ఇంకా ముఖం కూడా ట్యాన్‌ లేకుండా ఎలాంటి మచ్చలు లేకుండా చేసుకోవడానికి సెలూన్స్‌లో బానే ఖర్చుచేస్తున్నారట..పురుషులు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే అందంగా క‌న‌బ‌డ‌తారో తెలుసా.. 
పురుషుల అందాన్ని పెంచే ఆహారాల్లో క్యారెట్ ఒక‌టి. ఇది శ‌రీర ఆరోగ్యానికి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. క్యారెట్‌లో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల అనేక ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఇవ్వ‌డంతో పాటు శ‌రీరంలో విట‌మిన్ ఏ ను బీటా కెరోటిన్‌గా మార్చి ఆరోగ్య‌వంతంమైన చ‌ర్మాన్ని ఇవ్వ‌డంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి. క్యారెట్ నోట్లో లాలాజ‌లాన్ని ఎక్కువ‌గా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
క్యారెట్‌లో ఆల్క‌నిన్ అంశాలు పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఆమ్లా, క్షార ఉత్పత్తిని స‌మ‌తులం చేసి ర‌క్తాన్ని శుద్ధి, స‌మ‌తులం చేయ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల పురుషులు య‌వ్వ‌నంగా, శ‌క్తివంతంగా ఉంటారు. 
Healthy eating tips for men of all age groups | The Times of India
బీట్ రూట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా పురుషులు అందం మ‌రింత పెరుగుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. బీట్ రూట్‌లో నైట్రేట్ అధికంగా ఉంటుంది. బీట్ రూట్‌ను తిన్నప్పుడు ఇందులో ఉండే నైట్రేట్ నోట్లో బ్యాక్టీరియాతో క‌లిసి నైట్రేట్స్‌గా మారి మెద‌డుకు రక్త ప్ర‌స‌ర‌ణ‌ను పెంచుతుంది. 
బీట్ రూట్ రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి. అలాగే పురుషుల అందానికి, ఆరోగ్యానికి ట‌మాటాలు కూడా ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో శుక్ర‌క‌ణాల సంఖ్య పెరుగుతుంది. రోజూ ట‌మాటాను డైట్‌లో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది. 
పురుషులు పాల‌కూరను కూడా బాగా తినాలి.. వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవాలి. పాల‌కూర‌లో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మెండుగా ఉంటాయి. దీనిలో ఐర‌న్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. ఈ పోష‌కాల‌న్నీ పురుషుల అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. 
గుమ్మ‌డి కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌వ‌చ్చు. గుమ్మ‌డికాయ శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. దీనిని రోజూ వారి ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌న‌బ‌డుతుంది. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషులు అందంగా, య‌వ్వ‌నంగా, ఆరోగ్యంగా ఉంటారు. 
 
పురుషులు రోజుకు క‌నీసం మూడు నుంచి నాలుగు సార్లు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే ఫేస్ వాష్‌ను మాత్ర‌మే వాడాలి. అలాగే షేవింగ్ చేసుకున్న ప్ర‌తిసారి అలొవెరా జెల్‌ను చ‌ర్మానికి రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. విట‌మిన్ ఈ ఉండే క్రీముల‌ను వాడితే మంచిది. ఈ విధమైన ఆహారాల‌ను తీసుకంటూ ఈ చిట్కాల‌ను పాటించ‌డం వల్ల పురుషులు అందంగా క‌న‌బ‌డ‌తారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.