ఈ ఆహారం తింటున్నారా? అయితే ఆయుర్దాయం తగ్గినట్లే.

నూనె వంటలంటే ఎవరికిష్టముండదు చెప్పండి..చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ లాగించేస్తారు. ఎంత కఠినంగా ఉన్నా సరే ఆ నూనె పదార్థాలను చూస్తే మనసు జివ్వున లాగేస్తుంది. మనం తినే ప్రతి పూట భోజనంలోనూ ఏదో ఒక

ఈ ఆహారం తింటున్నారా? అయితే ఆయుర్దాయం తగ్గినట్లే.


నూనె వంటలంటే ఎవరికిష్టముండదు చెప్పండి..చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ లాగించేస్తారు. ఎంత కఠినంగా ఉన్నా సరే.....ఆ నూనె పదార్థాలను చూస్తే మనసు జివ్వున లాగేస్తుంది. మనం తినే ప్రతి పూట భోజనంలోనూ ఏదో ఒక వేపుడు లేనిదే ముద్ద కూడా దిగదు. చిప్స్‌ కావచ్చు, బాగ్‌ డీప్‌ ఫ్రై చేసిన వంటలైన ఉండాల్సిందే. అవి ఇంట్లో చేసినవే అయితే కొంతవరకు సేఫ్. అయితే బయటదొరికే వాటితోనే అసలైన ప్రమాదం.

Deep Fried and Good for You - The New York Times

ఈ మధ్యన చాలా ప్రైవేటు సంస్థల్లో మధ్యాహ్నభోజనం పెడుతున్నారు. దాంట్లో ఆహారంగా చిప్స్ పెడుతున్నారు. అవి రోజు తినడం వల్ల కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్లే. ఎందుకంటే అవి కడుపులో ప్లాస్టిక్‌లా పేరుకుపోతుంది. అది సరిగ్గా అరగక పోవడం వల్ల ముద్దలు ముద్దలుగా ఉండిపోయి జీర్ణం కాదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి.
నూనెలో వేయించేటప్పుడు నూనె ఆక్సిడైజ్‌ చెంది.. ట్రాన్స్‌ఫ్యాట్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఫ్రైడ్‌ పదార్థాల్ని రోజూ తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోయి..గుండె సంబంధిత వ్యాధులొస్తాయి.

కొంతమంది ఆకుకూరలు, కాయగూరలు నచ్చవు. అలాంటప్పుడు వాటిని బాగా డీప్‌ ఫ్రై చేసి తినేస్తుంటారు. కొంతవరకూ ఒకే అయినా.....రోజు అంటే ప్రమాదమే. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఫ్రై చేసేటప్పుడు అక్రిలమైడ్ అనే రసాయనం వెలువడుతుంది. ఇది క్యాన్సర్‌ కారకంగా మారే ప్రమాదమూ లేకపోలేదు. రోస్టింగ్‌, బేకింగ్‌ పద్ధతుల్లో తయారుచేసే పదార్థాలతోనూ ముప్పు తప్పదు.

మాంసాహారాన్ని గ్రిల్లింగ్‌ పద్ధతిలో ఉడికిస్తే హెటరో సైక్లిక్ అమైన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. సహజసిద్ధంగానే కార్సినోజెనిక్‌ స్వభావాన్ని కలిగి ఉండే ఈ రసాయనాలు.. భవిష్యత్తులో క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి.

అవెన్‌లో కొన్ని పదార్థాల్ని వండుకోవడం, తిరిగి వేడి చేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఈ పద్ధతిలో విడుదలయ్యే రేడియేషన్‌ కారణంగా బ్రెయిన్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది.

నూనె లేకుండా తక్కువ నూనెతో పదార్థాల్ని వేయించుకోవడానికి ప్రస్తుతం చాలామంది ఎయిర్‌ ఫ్రైయింగ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందుకోసం పలు గ్యాడ్జెట్స్‌ సైతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పద్ధతిలో ఉత్పత్తయ్యే వేడి గాలి....ఆరోగ్యానికి హాని కలిగించే పలు రకాల రసాయనాల్ని ఉత్పత్తి చేయడంతో పాటు...ఆయా పదార్థాలు సరిగ్గా ఉడక్కపోవచ్చు. మిగతా పద్ధతులతో పోల్చితే ఇది కాస్త ఆరోగ్యకరమైనదే అయినా.. తరచూ ఈ పద్ధతిని పాటించకూడదు.

ప్రస్తుతం చాలామంది ఈ తరహా వంట పాత్రల్ని ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో ఉండే టెఫ్లాన్‌ కోటింగ్‌ అధిక ఉష్ణోగ్రత వల్ల కరిగి వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అనారోగ్యాల్ని తెచ్చి పెట్టే ఇలాంటి అనారోగ్యకరమైన వంట పద్ధతులకు బదులు సంప్రదాయ పద్ధతుల్ని పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

ఆవిరిపై ఉడికించిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి. ఈ క్రమంలో నూనె ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.. దీనికి తోడు ఈ ఆవిరి చెడు కొవ్వుల్ని తొలగిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద కాకుండా మనం వండుకునే పదార్థాల్ని స్టౌపై సిమ్‌లో పెట్టి ఉడికిస్తే మంచిదంటున్నారు నిపుణులు. వంట కోసం ఆలివ్‌, క్యానోలా వంటి నూనెల్ని వాడడం ఆరోగ్యకరం. తయారుచేసే వంటకాల్లో ఉప్పు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, కృత్రిమ రంగుల్ని తగ్గిస్తే మరీ ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. అలాగే వంట కోసం ఎంచుకునే పాత్రలు కూడా స్టీలు, అల్యూమినియం, సెరామిక్‌, మట్టి.. వంటి మెటీరియల్స్‌తో తయారుచేసినవి ఎంచుకుంటే మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.