పూర్తిగా శాఖాహారం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?

కొంతమంది కేవలం వెజ్‌ మాత్రమే తింటారు. కొంతమంది నాన్‌వెజ్‌ మాత్రమే తింటారు. ముక్కలేనదే ముద్ద దిగదు వీళ్లకు.

పూర్తిగా శాఖాహారం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?
Benefits of Vegetarian diet


కొంతమంది కేవలం వెజ్‌ మాత్రమే తింటారు. కొంతమంది నాన్‌వెజ్‌ మాత్రమే తింటారు. ముక్కలేనిదే ముద్ద దిగదు వీళ్లకు. ఇంకొందరు ఉంటారు అవి ఇవి రెండూ తింటారు. మన దగ్గర చాలా మంది ఈ మూడో రకానికి చెందినవాళ్లు ఉంటారు. అయితే వీళ్లలో ఎవరూ ఆరోగ్యంగా ఉంటారు. కేవలం శాఖాహారులుగా మారడం ఆరోగ్యానకి మంచిదేనా..? కనీసం గుడ్డు, పాలు కూడా తినరట. మరి పోషకాలు అన్నీ వీళ్లకు లభిస్తాయా..?ఇతర ఆహారాలతో పోలిస్తే పూర్తి శాకాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేదో తెలుసుకుందాం. 

కొన్ని అధ్యయనాల ప్రకారం శాఖాహారం... గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది. స్వచ్ఛమైన శాఖాహారంలో కొవ్వు నిండిన ఆహార పదార్థాలు ఏవీ ఉండవు. కాబట్టి గుండె వంటి ప్రధాన అవయవాలు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయట. దీనివల్ల జీవన కాలం పెరిగే అవకాశం ఉంది. 

మాంసాహారం తినేవారితో పోలిస్తే శాఖాహారులు తక్కువ సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్, విటమిన్ సి, విటమిన్ ఈ, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఫైటో కెమికల్స్ ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకుంటారు. దీని వల్ల వారు బరువు కూడా పెరగరు. అయితే శాకాహారులు చాలా జాగ్రత్తగా ఆహారాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో త్వరగా పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది. శాకాహారం తీసుకునే వ్యక్తుల్లో విటమిన్ బి12, విటమిన్ డి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటివి లోపించే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ లోపాలు తీర్చడానికి సప్లిమెంట్లను వాడాల్సిందే. లేదా అవి అధికంగా ఉండే ఆహారాలు ఏవో తెలుసుకొని తినాలి. అయితే కొన్ని మాంసాహారాల్లోనే ఈ పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి సప్లిమెంట్లను వాడుకోవడం ఉత్తమ పద్ధతి.

పూర్తిగా శాఖాహారులుగా మారడం అనేది మీరు పెద్దయ్యాక స్టాట్‌ చేయడం కష్టమే. చిన్నప్పటి నుంచి సండే వస్తే కోడి, మేక, చేపలాంటివి ఏదో ఒకటి తిని బాగా ఎంజాయ్‌ చేయడానికి అలవాటు పడిన శరీరం.. ఉన్నట్టుండి వాటిని మానేయాలంటే కష్టమే. అయితే ఒకటి నిజం. మాంసాహారం తినడం మంచిదే..కానీ ఈరోజుల్లో ఏవి స్వచ్ఛమైనవి లేవు. కోళ్లకు ఇంజక్షన్‌లు చేసి పెద్దవి చేస్తున్నారు. వయసు చిన్నదేకానీ అవి చూసేందుకు మాత్రం దొడ్డుగా ఉంటాయి. ఇలాంటి కోళ్లు తినడం వల్ల మనకు ఎలాంటి పోషకాలు లభించవు. ఇక చేపలు నెలల తరబడి ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఏవేవో మందులు వేసి పెంచుతున్నారు. ఇలాంటి చేపలు తినడం కూడా మంచిది కాదు. మీరు తినాలనుకుంటే సముద్రపు చేపలు, ఎలాంటి ఫ్రిజర్వేటీస్‌ వాడకుండా ఉన్నవి తినాలి. ఇక అవి దొరకడం కష్టమే.!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.