ఎప్పుడు నీరసంగా అనిపిస్తుందా.. ఈ డ్రింక్స్ ఒకసారి ట్రై చేస్తే సరి!

ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్తే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండల్లో బాడీ డిహైడ్రేట్ అయిపోవడంతో పాటు శరీరంలో ఉండే లవణాలు అన్ని చెమట రూపంలో బయటకు పోతూ ఉంటాయి. ఈ సమయంలో శరీరానికి కచ్చితంగా

ఎప్పుడు నీరసంగా అనిపిస్తుందా.. ఈ డ్రింక్స్ ఒకసారి ట్రై చేస్తే సరి!


ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్తే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఎండల్లో బాడీ డిహైడ్రేట్ అయిపోవడంతో పాటు శరీరంలో ఉండే లవణాలు అన్ని చెమట రూపంలో బయటకు పోతూ ఉంటాయి. ఈ సమయంలో శరీరానికి కచ్చితంగా ఎనర్జీ అవసరం. అయితే తేలిగ్గా నీరసాన్ని తగ్గించుకోవడానికి కొన్ని డ్రింక్స్ ప్రయత్నిస్తే సరిపోతుందని తెలుస్తోంది.. మరి అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

సిట్రస్ జాతి పండ్లు.. ఎండాకాలం అంటేనే అందరూ నిమ్మకాయలకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఎవరింట్లో చూసినా ఫ్రిజ్ నిండా నిమ్మకాయలు నిండిపోతాయి. సిట్రస్ జాతి పండ్లలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండటంతో పాటు పొటాషియం అధికంగా ఉంటుంది. అందుకే బయట తిరిగి వచ్చిన వెంటనే గ్లాసుడు నీళ్లలో నిమ్మకాయ, ఉప్పు కాస్త పంచదార కలిపి తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి పుంజుకుంటాయి. ఎలాంటి నీరసమైన ఇట్టే తగ్గిపోతుంది..

కొబ్బరి నీళ్లు.. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు చేసే మేలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో ఉండే పోషకాలు అమోఘం. సహజంగా ప్రకృతి నుంచి లభించే అద్భుతమైన కొబ్బరినీలను తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి పుంజుకుంటుంది..

చియా సీడ్స్.. శరీరంలో ఉండే వేడిని మొత్తం తగ్గించి ఎనర్జీని ఇవ్వడంలో చియా సీడ్స్ ముందుంటాయి.. ఇందులో కాల్షియం సల్ఫర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఎన్నో సమస్యలని పారద్రోలాడంతోపాటు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల చర్మం జుట్టు ఆరోగ్యంగా మారుతాయి..

పుచ్చకాయ జ్యూస్.. సమ్మర్ లో ఎక్కువగా దొరికే పుచ్చకాయను తరచు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి ఈ జ్యూస్ ను తర్శ తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉండటంతో పాటు చర్మం నివారింపును సంతరించుకుంటుంది.

బార్లీ నీళ్లు.. ఆరోగ్యం మీద అవగాహన ఉన్నవారు ఈ ఎండాకాలం రాగానే బార్లీ నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకుంటారు ఇవి శరీరానికి చేసే మేలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కిడ్నీలని శుభ్రపరచడంతో పాటు శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తూ ఎనర్జీని రప్పిస్తుంది తరచూ వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.