రాగులతో చేసే ఆహారం చేసే మేలెంతో తెలుసా.. !

ఆహార విప్లవం వచ్చిన తర్వాత కొత్త రకాల వరి వంగడాలను సృష్టించి వరి ఉత్పత్తిని పెంచింది భారతదేశం.. అంతకుముందు భారతదేశంలో అంతగా వరిని పండించేవారు కాదు..

రాగులతో చేసే ఆహారం చేసే మేలెంతో తెలుసా.. !
ragi benefits


ఆహార విప్లవం వచ్చిన తర్వాత కొత్త రకాల వరి వంగడాలను సృష్టించి వరి ఉత్పత్తిని పెంచింది భారతదేశం.. అంతకుముందు భారతదేశంలో అంతగా వరిని పండించేవారు కాదు.. కేవలం సంపన్న కుటుంబం వాళ్ళు మాత్రమే అన్నాన్ని తీసుకునేవారు మిగిలిన వారంతా రాగులు, జొన్నలు వంటి వాటితో కడుపు నింపుకునేవారు.  అయితే రాగుల్ని రోజు ఆహారంలో భాగం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.. 

రాగుల్ని రోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలని తెలుస్తుంది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు అలాగే ఇందులో కాల్షియంతో ఎముకలకు బలం చేకూరడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని తెలుస్తోంది. అలాగే చిన్న పిల్లలకు సైతం దీన్ని ఆహారంలో భాగంగా ఇవ్వాలి.. రాగులతో ఎన్నో రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు అందులో ముఖ్యంగా రాగిజావ, రాగిసంకటి, రాగి రొట్టె వంటివి ఆహారానికి ఎంతో మంచిది వీటిని ఏ రకంగా తీసుకోగలిగితే ఆ రకంగా తీసుకోవడం మేలు..

అలాగే రోజు వ్యాయామం చేసేవారు రాగి జావను తీసుకోవడం వల్ల ఆయాసం అదుపులో ఉండి.. స్టామినా కూడా పెరుగుతుందని అంటున్నారు నిపుణులు.. అలాగే బరువు తగ్గాలనుకొని వ్యాయామం చేసే వారు వ్యాయామం అనంతరం ఒక గ్లాసు రాగిజావ తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న నీరు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. తేలిగ్గా బరువు తగ్గడానికి ఇది ఒక చక్కటి పరిష్కారం గానే చెప్పవచ్చు.. అంతేకాకుండా ఎముకలు గట్టిపడతాయి.. శరీరంలో ఉండే కొలెస్ట్రాల సైతం నియంత్రణలో ఉంచడానికి రాగిజావ ఎంతగానో ఉపయోగపడుతుంది.. 

అలాగే చక్కర వ్యాధి ఉన్నవారు రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ రాగి జావలో కొంత పెరగడం కలుపుకొని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.. ఈ వ్యాధి అదుపులో ఉండటమే కాకుండా రోజంతా ఎంత ఉత్సాహంగా అనిపిస్తుంది.. అలాగే తొందరగా వయసు పై పడటం వంటి లక్షణాలు దూరం చేసుకోవచ్చు..

అలాగే రక్తహీనతతో బాధపడేవారు సైతం రాగుల్ని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల లభాలు ఉంటాయి.. మరి ఎక్కువగా వీటిని తినలేకపోతే కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా ఏదో ఒక రూపంలో తీసుకోవాలని తెలుస్తుంది అలాగే రాత్రి సమయంలో రాగి రొట్టెలను తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది అలాగే ఉదయం అల్పాహారంలో సైతం రాగిసంకటిని గాని బెల్లంతో చేసిన రాగి పదార్థాలను కానీ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం వంటి పోషకాలని సక్రమంగా అందుతాయని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.