ఈ 5 ఆహారాలు తింటే ఎండ మిమల్ని ఎం చేయలేదు..

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న వేడి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఎయిర్ కూలర్లు లేదా ఏసీలను తెచ్చుకోవడం..  చల్లని పానీయాలను తాగడం చేస్తున్నారు.  ఇవి శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి కానీ.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం

ఈ 5 ఆహారాలు తింటే ఎండ మిమల్ని ఎం చేయలేదు..


పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న వేడి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఎయిర్ కూలర్లు లేదా ఏసీలను తెచ్చుకోవడం..  చల్లని పానీయాలను తాగడం చేస్తున్నారు.  ఇవి శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి కానీ.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.  ముఖ్యంగా  వేసవి కాలంలో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే దాని చెడు ప్రభావం మన ఆరోగ్యం,కడుపుపై చూపిస్తుంది. అందుకే శరీరాన్ని చల్లగా ఉంచే ఆ ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. లేదంటే ఆహారంలో అవసరమైనంత ప్రొబయాటిక్స్, చలువ చేసే పదార్థాలు చేర్చుకోవడం ఇంకా మంచిది.  పెరగన్నం, బార్లీ, రాగులను తినడం, మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు రసం తాగడం వల్ల జీర్ణ సమస్యలు దరి చేరవు.

Seven healthy summer foods! | Healthy Eating News | Zee News

మండిపోతున్న ఎండల్లో 5 ఆహార పదర్ధాలు తీసుకుంటే చాలా మంచిది...

మజ్జిగ.. వేసవిలో మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు.  దీంట్లో కూడా ప్రొబయాటిక్స్ ఉంటాయి. జీర్ణక్రియ వేగవంతం చేస్తాయి. తక్కువ కొవ్వు, కేలరీలుంటాయి.
మజ్జిగలో ఆవాలు, పుదీనా, కరివేపాకు కలిపితే  రుచి అద్భుతం. నూనె లేకుండా ఒక చెంచా ఆవాలు, కరివేపాకు వేయించుకోవాలి. చల్లారాక పుదీనా ఆకులతో కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మజ్జిగలో కలుపుకుంటే ఆరోగ్యంతో పాటూ రుచి వస్తుంది.

పెరుగన్నం..  పెరుగన్నం ఎంతో సాయపడుతుంది. దీంట్లో పుష్కలంగా ఉన్న ప్రొబయాటిక్స్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.  క్యాల్షియం, ప్రొటీన్ మన శరీరానికి అవసరమైనంత దొరుకుతుంది. ఇందులో కూడా చలువ చేసే లక్షణాల ఎక్కువ.

బూడిద గుమ్మడి కాయ జ్యూస్..  వేసవిలో ప్రేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. చలువ చేసే లక్షణం చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో నీళ్ల శాతం ఎక్కువ ఉండటం వల్ల  డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. శరీరంలో పీహెచ్ స్థాయులు నియంత్రణలో ఉంచుతుంది. అజీర్తి, బ్లోటింగ్ సమస్యలు రాకుండా చూస్తుంది.

బార్లీ సలాడ్.. మలబద్దకం, ప్రేగు సమస్యలు రాకుండా చలువ చేసే పోషకభరితమైన ఆహారం ఇది. బార్లీలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది.
బార్లీలో విటమిన్లు, మినరళ్లుంటాయి. ఐరన్, మెగ్నీషియం, సెలేనియం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉడికించిన బార్లీ గింజలతో పాటూ కూరగాయలు, పండ్లు, నట్స్ కలుపుకుని తినొచ్చు.  వేసవిలో చలువ చేసే ఆహారం ఇది.

పెసర మొలకలతో సలాడ్.. మొలకెత్తిన పెసర్లతో చేసిన సలాడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫైబర్, ఎంజైములు, విటమిన్లు ఆహారం తొందరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దీంట్లో కొవ్వు తక్కువ, పోషకాలెక్కువ. మొలకెత్తిన పెసర్లలో కాస్త పెరుగు కలుపుకుని తింటే చాలా మంచిది. లేదంటే మొలకలతో పాటూ కూరగాయలు, హర్బ్స్, పెరుగు కలుపుకోండి. మీద కాస్త ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం పిండుకోవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.