ఆరోగ్యానికి మేలు చేసే రాగి అంబలి.. పాతకాలం వంట అయినా మళ్లీ మొదలెట్టాల్సిందే..!

రాగులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో..ఈ జనరేషన్‌ వాళ్లకంటే.. మన అమ్మమ్మల కాలం వారికి బాగా తెలుసు.. ఒకప్పుడు రాగులు, సజ్జలు, కొర్రలు వంటివి తినే వాళ్లు వందేళ్లు అయినా.. ఎలాంటి రోగాలు లేకుండా బతికేశారు..

ఆరోగ్యానికి మేలు చేసే రాగి అంబలి.. పాతకాలం వంట అయినా మళ్లీ మొదలెట్టాల్సిందే..!


రాగులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో..ఈ జనరేషన్‌ వాళ్లకంటే.. మన అమ్మమ్మల కాలం వారికి బాగా తెలుసు.. ఒకప్పుడు రాగులు, సజ్జలు, కొర్రలు వంటివి తినే వాళ్లు వందేళ్లు అయినా.. ఎలాంటి రోగాలు లేకుండా బతికేశారు.. అప్పుడు జబ్బులు తక్కువగా ఉండేవి.. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లలకు కళ్లజోళ్లు వేయాల్సి వస్తుంది. ఇక రోగాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకు వస్తాయో, ఎవరికి వస్తాయో తెలియకుండా మారిపోయింది పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా మనం మారాలి.. ఆహారపు అలవాట్లు మార్చాలి.. మళ్లీ పాతకాలం నాటి వంటలను తినాల్సిన సమయం వచ్చేసింది.. అందులో రాగి అంబలి ప్రధానమైనది. రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా బ‌రువు త‌గ్గుతారు. ఇంకా చాలా లాభాలే ఉన్నాయి.

ರಾಗಿ ಅಂಬಲಿ ಮಾಡುವ ವಿಧಾನ RAGI AMBLI RECIPE IN KANNADA - YouTube

రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. రాగి అంబ‌లికి చ‌లువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గ్లాస్ రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయ‌దు. దీంతో క‌డుపు నిండిన భావ‌న కలుగుతుంది. ఆహారం ఎక్కువ‌గా తినాల‌నిపించ‌దు. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. స్థూల‌కాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

పరగడుపున రాగి అంబలి తాగితే ఇంకా మంచిది.. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శారీరక శ్రమ చేసేవారికి రాగి అంబలి మంచి బలాన్ని ఇస్తుంది. రాగి అంబలి పిల్లలకు మంచిది. మెదడు చురుగ్గా పనిచేసి.. చదువులో మంచి ప్రతిభను కనబరుస్తారు. శరీరంలోని అధిక వేడిని ఇది తగ్గిస్తుంది. చ‌లువ చేస్తుంది. స్థూల‌కాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బీపీ, షుగ‌ర్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. ర‌క్త‌స్రావం జ‌రుగుతున్న వారికి రాగి అంబ‌లి తాగిస్తే రక్తస్రావం ఆగిపోతుంది. రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్ర‌తి రోజూ ఉద‌యం చేసే సాధార‌ణ అల్పాహారానికి బ‌దులుగా రాగి అంబ‌లి తాగితే దాంతో మ‌నం రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. శారీర‌క దృఢ‌త్వం చేకూరుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. కాబట్టి అందరూ ఉదయం టిఫెన్స్‌ లిస్ట్‌లో కనీసం ఒక్క రోజు అయినా రాగి అంబలిని చేర్చి..మీతో పాటు మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి.. మంచి ప్రయోజనాలను పొందండి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.