మండిపోతున్న ఎండల్లో కర్బుజా తో ఇలా ఛిల్ అయిపోండి..!

ఈ వేసవిలో అత్యంత ఎక్కువగా దొరికే అద్భుతమైన పండు ఖర్బుజ. అందరూ ఇష్టంగా తినే ఈ కర్బూజా పండు పోషకాలు గని అనే చెప్పవచ్చు. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా

మండిపోతున్న ఎండల్లో కర్బుజా తో ఇలా ఛిల్ అయిపోండి..!


ఈ వేసవిలో అత్యంత ఎక్కువగా దొరికే అద్భుతమైన పండు ఖర్బుజ. అందరూ ఇష్టంగా తినే ఈ కర్బూజా పండు పోషకాలు గని అనే చెప్పవచ్చు. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా.. కార్బోహైడ్రేట్స్.. డైటరీ ఫైబర్.. విటమిన్ ఏ సి ఈ కాల్షియం ఐరన్ మెగ్నీషియం అంటివి అధికంగా ఉంటాయి అందుకే వీటిని తీసుకోవడం వల్ల అత్యంత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.

गर्मी में होने वाली इन बीमारियों से छुटकारा दिलाएगा खरबूजा, जानें इसके  फायदे | Hari Bhoomi

చాలామంది కర్బుజా జ్యూస్ తాగడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఖర్బూజా పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది అవి ఏంటంటే..

కర్బుజాని ఏ రూపంలో తీసుకున్న ఇందులో అధిక స్థాయిలో ఉండే నీరు శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఎండాకాలంలో శరీరం కోల్పోయిన లవణాలు పోషకాలను ఇందులో ఉండే ఖనిజాలు అందిస్తాయని చెబుతున్నారు.

ఇందులో విటమిన్ సి ఏ అధికంగా ఉంటాయి. ఇవి కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఎండలో తిరిగి వచ్చిన వారు చూసిన తీసుకోవడం వల్ల శరీరం లో ఉండే ఉష్ణోగ్రత తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఎండాకాలంలో ఎండవలన కళ్ళుమండటం ఎర్రగా మారటం వంటివి ఈ పండు దూరం చేస్తుంది.

కర్బూజాలా పొటాషియం స్థాయిలో అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే రక్తపోటును హాదుపులో ఉంచుతాయి. దీనివలన హైబీపీ అదుపులో ఉంటుంది.

కొందరికి ఎసిడిటీ వంటి సమస్యల అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కడుపులో గ్యాస్ మంట అంటే సమస్యలు ఉన్నవారు కర్బూజ పండుగను తరచు తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ అదుపులో ఉంటాయి అలాగే దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

బరువు తగ్గే ఆలోచన ఉన్నవారు ఈ పండుగను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఏదో ఒక సమయంలో ఈ పండును తినటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు దీని ద్వారా శరీరానికి అవసరాన్ని పోషకాలు అందడంతో పాటు బరువు అదుపులో ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.