మలబద్ధత రోజురోజుకీ ఇబ్బందికరంగా మారుతుందా.. ఈ ఆహార పదార్థాలు ప్రయత్నిస్తే సరి..!

మారిపోయిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. తిన్నది జీర్ణం కాక, సమయానికి శరీరంలోని వ్యర్ధాలు బయటికి పోక నానా అవస్థలు పడుతున్నారు. సమయానుకూలంగా పనిచేయాల్సిన

మలబద్ధత రోజురోజుకీ ఇబ్బందికరంగా మారుతుందా.. ఈ ఆహార పదార్థాలు ప్రయత్నిస్తే సరి..!


మారిపోయిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చాలామంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. తిన్నది జీర్ణం కాక, సమయానికి శరీరంలోని వ్యర్ధాలు బయటికి పోక నానా అవస్థలు పడుతున్నారు. సమయానుకూలంగా పనిచేయాల్సిన జీర్ణ వ్యవస్థ గాడి తప్పడం వల్ల ఆ పరిణామాలతో అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సివస్తుంది. 

కొంతకాలం క్రితం వరకు వృద్ధుల్లో కనిపించే ఈ మలబద్ధకం సమస్య ఇప్పుడు యువతను వేధిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. అయితే ఈ సంవత్సరం నుంచి బయట పడాలి అంటే ఆహారపు అలవాటులను సరి చేసుకోవడం ప్రధానమంటున్నారు వైద్యులు. ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగితే మల బద్ధతని సులువుగానే సరిచేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇందుకోసం....

ఆహారంలో పీచు పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పీచు అంటే జీర్ణం కాకుండా మిగిలిపోయే పిండి పదార్ధం...  దీనినే కార్బొహైడ్రాట్ అంటారు. సాధారణంగా కూరగాయలు, పళ్ళు, కొన్ని రకాల ధాన్యాలలో మృదువుగా వుండే పీచు పదార్థం ఎక్కువగా వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు సహాయపడుతుంది. పేగుల కదలికల్ని పెంచి, విరేచనం మృదువుగా అయ్యేలా చేస్తుంది.

పీచు ఎక్కువగా ఉండే ఆహార ధాన్యాలు... రాగులు, గోధుమ, జొన్న, ఉలవలు, ఆకుకూరలు, ములక్కాడలు, కాకర, బీర, ఖర్జూరం, జామ, యాపిల్... ఇలాంటి వాటిలో మృదువైన పీచు పదార్థాలు ఎక్కువగా వుంటాయి. ఆహారంలో వీటి వాటాను పెంచాలి. అలాగే బియ్యాన్ని తగ్గించడం మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.