తిన్నాక అదేపనిగా త్రేన్పులు వస్తున్నాయా..? జాగ్రత్త ఆ క్యాన్సర్‌ కావొచ్చు

మనిషి తినకుండా బతకలేడు.. కానీ కొంతమంది మాత్రం తింటే బతకలేరు. ఆగం ఆగం అవుతారు. తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్లు ఉండటం, గ్యాస్‌, ఒకటే తేన్పులు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకే చాలా మంది తిన్నాక గ్యాస్‌ ట్యాబ్లెట్‌ వేస్తుంటారు. ఫుల్‌గా తిన్నాక త్రేన్పు రావడం సహజం. కానీ అదేపనిగా త్రేన్పులు వస్తున్నాయంటే.. ఏదో సమస్య ఉన్నట్లే మైక్‌.. చాలా పగడ్బంధీగా మీ కడుపు

తిన్నాక అదేపనిగా త్రేన్పులు వస్తున్నాయా..? జాగ్రత్త ఆ క్యాన్సర్‌ కావొచ్చు


మనిషి తినకుండా బతకలేడు.. కానీ కొంతమంది మాత్రం తింటే బతకలేరు. ఆగం ఆగం అవుతారు. తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్లు ఉండటం, గ్యాస్‌, ఒకటే తేన్పులు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకే చాలా మంది తిన్నాక గ్యాస్‌ ట్యాబ్లెట్‌ వేస్తుంటారు. ఫుల్‌గా తిన్నాక త్రేన్పు రావడం సహజం. కానీ అదేపనిగా త్రేన్పులు వస్తున్నాయంటే.. ఏదో సమస్య ఉన్నట్లే మైక్‌.. చాలా పగడ్బంధీగా మీ కడుపు మిమ్మలన్ని ఇరకాటంలోకి నెడుతుంది. మరి ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా..? ఏం చేయాలి..ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువగా తేన్పులు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు భుక్తాయాసంతో పాటు కడుపులో నుంచి గాలి బ్రేవ్ మంటూ ఉత్పన్నమవుతుంది, ఈ విధంగా బ్రేవ్ మంటూ గాలి ఉత్పన్నమవటాన్నే త్రేన్పు లేదా తేపు అంటారు. ఇలాంటి సమస్యలకు మనం తిన్న ఆహారమే కారణం. రోడ్డు పక్కన ఉన్న ఫుచ్కా, మోమో, చాట్, నూడుల్స్, రోల్, చౌమిన్ స్టాల్స్ లాంటి అడ్డవైన గడ్డి అంతా పొట్టలో వేసుకుంటే.. తినేప్పుడు కమ్మగానే ఉంటుంది. తిన్నాకనే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. మీ ఆరోగ్యం దెబ్బతినడానికి ఇవే ప్రధాన కారణాలు. 

అదేపనిగా తేన్పులు రావడం మరణానికి సంకేతం కావచ్చు. తాజాగా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఫ్లోరిడాలోని ఓ మహిళ తేన్పులు ఆపుకోలేకపోయింది. చివరకు డాక్టర్ వద్దకు వెళ్లడంతో కోలన్ క్యాన్సర్‌ ఉన్నట్లు చెప్పారు. తేన్పులు పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంబంధించినది కానప్పటికీ. పెద్దప్రేగు క్యాన్సర్ శరీరంలో గూడు కట్టుకున్నప్పుడు, జీర్ణవ్యవస్థ చెదిరిపోతుంది. గ్యాస్ నిండి, దాని నుండి తరచుగా బర్పింగ్ ఏర్పడుతుంది. కాబట్టి వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
  
కడుపులో నిరంతర వికారం, ఉబ్బరం, బరువు తగ్గడం కూడా పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కాబట్టి మీకు ఈ లక్షణాలు ఉంటే, ముందుగా వైద్యుడిని సంప్రదించండి. సాధారణం కంటే ఎక్కువ తేన్పులు ఉంటే లేదా ఏదైనా తిన్న తర్వాత తేన్పులు పెరిగినట్లయితే, మీరు ఇంటి నివారణలు పాటించకుండా వైద్యులను సంప్రదించడం బెటర్‌.
క్రమరహిత ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఇంట్లో వండిన ఆహారానికి బదులుగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం మరియు అధిక ఒత్తిడి - ఇవన్నీ చిన్న వయస్సు నుండి పెద్దప్రేగు క్యాన్సర్ మానవ శరీరంపై దాడి చేయడానికి కారణమవుతాయి. కాబట్టి మంచి జీవనశైలిని పాటించడండి. పదిమందికి నేర్పించండి. మీదాక వచ్చిందో లేదు.. మళ్లీ మన పూర్వీకులు తిన్న ఆహారానికే జనాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. మెల్లగా అదే దారిలో వెళ్తున్నారు.! 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.