లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే..!

జనరల్‌గా అందరూ వాళ్లకు ఇష్టమైన ఆహారాలే తింటారు.. కానీ ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఎలా ఆలోచించాలో తెలుసా..? మన శరీరంలో ఉండే అవయవాలకు ఎలాంటి ఫుడ్‌ అంటే ఇష్టం.. ఏది తింటే అవి బాగా పనిచేస్తాయి..,

లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే..!


జనరల్‌గా అందరూ వాళ్లకు ఇష్టమైన ఆహారాలే తింటారు.. కానీ ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఎలా ఆలోచించాలో తెలుసా..? మన శరీరంలో ఉండే అవయవాలకు ఎలాంటి ఫుడ్‌ అంటే ఇష్టం.. ఏది తింటే అవి బాగా పనిచేస్తాయి.., ఏది తింటే ఆ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.. ఒక్కో రోజు ఒక్కో అవయవానికి మేలు చేసే ఫుడ్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.. ఇలా ప్లాన్‌ చేసుకుని తింటుంటే.. ఎంత ఆరోగ్యంగా ఉంటారో కదా.. కిడ్నీలకు ఏది మేలు చేస్తుంది, లివర్‌కు ఏది అవసరం, బ్రెయిన్‌ షార్ప్‌గా ఉండాలంటే ఏం కావాలి, హార్మోన్‌ అసమతుల్యత రాకుండా ఉండాలంటే ఏం తినాలి.. ఇవన్నీ తెలిసి ఉండాలి.. తెలుసుకోవడం మీ బాధ్యత కూడా.. ఈరోజు మనం లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం ఏం ఆహారాలు తినాలో చూద్దాం..!

7 Myths and Facts about Cirrhosis - UChicago Medicine

ప‌సుపు

ప‌సుపులో క‌ర్‌క్యుమిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది. లివ‌ర్‌కు హెప‌టైటిస్ బి, సి వంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపును క‌లుపుకుని రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. అందులోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

అవ‌కాడో

అవ‌కాడోలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ బోలెడు ఉంటాయి. ఇవి లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. అవ‌కాడోల్లో గ్లూటాథియోన్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది.

బొప్పాయి

త‌ర‌చూ బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివ‌ర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బొప్పాయిలో ఉండే పొటాషియం లివ‌ర్‌, కిడ్నీల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వాటిల్లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. ముఖ్యంగా శ‌రీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా ఉంటుంది. దీని వ‌ల్ల గౌట్ వంటి స‌మ‌స్య‌లు రావు.

వెల్లుల్లి


వెల్లుల్లిలో అల్లిసిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నంతోపాటు విట‌మిన్ సీ, కే, ఫోలేట్‌, నియాసిన్‌, థ‌యామిన్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని సంర‌క్షిస్తాయి. వెల్లుల్లిలో ఉండే స‌ల్ఫ‌ర్ లివ‌ర్ ఎంజైమ్‌ల‌ను యాక్టివేట్ చేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే వెల్లుల్లిలోని సెలీనియం లివ‌ర్ దెబ్బ తిన‌కుండా సంర‌క్షిస్తుంది.

ఉసిరి

ఉసిరికాయ‌ల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. లివ‌ర్‌ను సంర‌క్షిస్తుంది. లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది. రోజుకు 3-4 ఉసిరికాయ‌ల‌ను తినొచ్చు.. లేదా ప‌ర‌గ‌డుపునే ఉసిరికాయ‌ల ర‌సాన్ని తాగినా లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివ‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

పాల‌కూర‌, క్యారెట్ జ్యూస్

పాల‌కూర‌, క్యారెట్‌ల‌లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు స‌రిగ్గా ఉంటాయి. లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ పాల‌కూర‌, క్యారెట్‌ల‌ను క‌లిపి జ్యూస్ రూపంలో తీసుకుంటే లివ‌ర్ హెల్తీగా ఉంటుంది..

ఆకుప‌చ్చని కూర‌గాయ‌లు

ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో విట‌మిన్లు ఎ, సీ, కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ర‌క్తాన్ని శుద్ది చేస్తాయి. లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.

బీట్‌రూట్

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు బీట్‌రూట్‌లో ఉంటాయి. బీటాలెయిన్స్ అన‌బ‌డే బ‌యో యాక్టివ్ సమ్మేళ‌నాలు కూడా బీట్‌రూట్‌లో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. వారానికి మూడు సార్లు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

గ్రీన్ టీ

రోజూ ఉద‌యాన్నే చాలా మంది ఒక క‌ప్పు కాఫీ లేదా టీ తాగుతారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంట‌నే కాఫీ లేదా టీ తాగ‌డం చాలా మంది. అలవాటు.. అయితే వాటికి బ‌దులుగా గ్రీన్ టీ తాగండి.. దీని వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. కొవ్వు క‌రుగుతుంది. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. గ్రీన్ టీలో కాటెచిన్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివ‌ర్‌ను శుభ్ర ప‌రుస్తాయి.

వాల్‌న‌ట్స్

వాల్‌న‌ట్స్‌లో విట‌మిన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవ‌న్నీ అనేక ర‌కాల వ్యాధులు రాకుండా చూస్తాయి. వాల్‌న‌ట్స్‌లో ఆర్గైనైన్ అన‌బ‌డే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది లివ‌ర్‌ను శుభ్ర ప‌రుస్తుంది. వాల్‌నట్స్‌ బ్రెయిన్‌కు, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి..


సో..ఇది సంగతీ.. ఇందులో మీరు ఎన్ని డైలీ తింటున్నారు. డైలీ కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారి అయినా వీటిల్లో ఏదైనా తినే అలవాటు ఉందా..? పసుపు కూరల్లో వేస్తారు కదా చాలులే అనుకుంటే పొరపాటే..! లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలాంటి ఆహారాలను మీ డైట్‌లో భాగం చేసుకోవాల్సిందే..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.