ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఈ 9 మార్గాలు అనుసరిస్తే సరి..!

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో సతమతమైపోతున్నారు ఈ కాలంలో మంచం ప్రశాంతంగా ఉంచుకొని ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు కరువైపోతున్నాయి. అయితే ఎంతటి ఊరుకో పరుగుల జీవితంలో అయినా మనసును ప్రశాంతంగా తేలికగా ఉంచుకోవాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు

ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఈ 9 మార్గాలు అనుసరిస్తే సరి..!


నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో సతమతమైపోతున్నారు ఈ కాలంలో మంచం ప్రశాంతంగా ఉంచుకొని ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు కరువైపోతున్నాయి. అయితే ఎంతటి ఊరుకో పరుగుల జీవితంలో అయినా మనసును ప్రశాంతంగా తేలికగా ఉంచుకోవాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు మానసిక నిపుణులు అవి ఏంటంటే..
Stress: the mechanisms involved and its impacts on health
నచ్చిన పనులు: రోజులో ఎంతో కొంత సమయాన్ని మన కోసం, మనకు నచ్చిన పనులు చేయడం కోసం కేటాయించాలి. మొక్కలు నాటడం, అభిరుచులకు పదును పెట్టడం లాంటివి చేయాలి.
డీప్‌ బ్రీతింగ్‌: దీర్ఘ శ్వాసతో నాడీ వ్యవస్థ నెమ్మదించి, ఒత్తిడి తొలుగుతుంది. దీర్ఘ శ్వాసతో ఆక్సిజన్‌ శరీరంలోకి, మెదడుకు చేరుకుని, స్వాంతన పొందుతాం!
డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌: స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు, టివిలకు రోజులో కొంత సమయం పాటు దూరంగా ఉండాలి.
వ్యాయామం: వ్యాయామంతో శరీరం చురుగ్గా మారడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. వ్యాయామంతో ఎండార్ఫిన్లు అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. అలాగే ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుంది.
నిద్ర: ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవడం కూడా అవసరమే! నిద్ర లోపిస్తే శరీరంలో స్ట్రెస్‌ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఆందోళన, చీకాకు పెరుగుతాయి. నిద్రలేమితో స్పష్టమైన ఆలోచన కొరవడుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది.
ధ్యానం: ధ్యానంతో మన ధ్యాస ఇతర అంశాల మీదకు వెళ్లకుండా ఉంటుంది. దాంతో మనసు, శరీరం నెమ్మదిస్తాయి. కార్టిసాల్‌, అడ్రెనలిన్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, మానసిక ప్రశాంతత దక్కుతుంది.
సంగీతం: ఒత్తిడిని తొలగించడానికి సంగీతం తోడ్పడుతుంది. ఆందోళన స్థాయిలను తగ్గించి, గుండె వేగాన్ని అదుపులోకి తెచ్చే సామర్థ్యం సంగీతానికి ఉంది. కాబట్టి నచ్చిన సంగీతాన్ని వింటూ ఉండాలి.
దురలవాట్లు: ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం మద్యపానం, ధూమపానం లాంటివి అలవాటు చేసుకోకూడదు. అవి తాత్కాలిక ఉపశమనాన్ని అందించినా, దీర్ఘకాలంలో వ్యసనాలుగా మారి జీవితాన్ని దుర్భరం చేస్తాయి.
సమయపాలన.. ఒక క్రమశిక్షణ ఏర్పరచుకొని సమయానికి అన్ని పనులు పూజ చేసుకుంటే ఎలాంటి ఒత్తిడి దరిశాలతో నిత్యజీవితంలో ఇది ముఖ్యమైన విషయం ఈ నియమానుపాటిస్తే రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది...
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.