Food for sharp brain : మీ పిల్లల బ్రెయిన్ షార్ప్ గా ఉండాలా.. వీటిని తినిపించండి.. 

Food for sharp brain : ఆరు సంవత్సరాల లోపు పిల్లల Brain ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది.. ఈ వయసు పిల్లలకు పోషకాహారం అందించడం ఎంతైనా అవసరం.. ముఖ్యంగా ఈ సమయంలో వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారు అనేదాన్ని

Food for sharp brain : మీ పిల్లల బ్రెయిన్ షార్ప్ గా ఉండాలా.. వీటిని తినిపించండి.. 
Keep your child's brain sharp with this food


Food for sharp brain : ఆరు సంవత్సరాల లోపు పిల్లల బ్రెయిన్ ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది.. ఈ వయసు పిల్లలకు పోషకాహారం అందించడం ఎంతైనా అవసరం.. ముఖ్యంగా ఈ సమయంలో వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారు అనేదాన్ని బట్టి వారి తర్వాత జీవితం కచ్చితంగా ఆధారపడి ఉంటుంది..  అందుకే పిల్లల బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలి అంటే కచ్చితంగా ఈ ఫుడ్ ను వారికి ఇవ్వాల్సిందే.. 

ముఖ్యంగా పిల్లలకు ఆహారంలో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, పప్పులు, గుడ్లు వంటివి ఇవ్వాలి.. అయోడిన్, జింక్, కోలిన్‌, విటమిన్లు A, B12, D వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి. అలాగే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఫోలేట్, ఐరన్ ఉండేలా చూసుకోవాలి.

శనగల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి..  ముఖ్యంగా వీటిలో ఐరన్, జింక్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి వీటిని నేరుగా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే హమ్మస్‌ రూపంలో ఇవ్వండి.. అలాగే పని తేలికగా అయిపోతుంది కదా అని వీటిని బయట కొని తెచ్చి బదులు ఇంటిలోనే చేసి ఇవ్వటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. 

అలాగే పిల్లలకు తరచూ గుడ్డును ఆహారంలో భాగం చేయాలి..  గుడ్డులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి..  అందువలన వీటిని తినిపించడం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.. అలాగే ఈ వయసు పిల్లలకు నిద్ర ఎక్కువగా అవసరం. అంతేకాకుండా శారీరక వికాసానికి తగినంత వ్యాయామం కూడా చేయించాలి..వీటిని ఆహారంలో చేర్చడం వల్ల పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల సక్రమంగా ఉంటుంది..

సీజనల్ పండ్లను పిల్లలకు తరచూ ఇస్తూ ఉండాలి. చక్కెర లేకుండా ఇంట్లోనే తయారుచేసిన పళ్ల రసాలు పిల్లలకు తరచు ఇవ్వటం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పిల్లల శరీరానికి ఎదుగుదలకు సహాయపడతాయి. ఎండాకాలంలో డిహైడ్రేట్ కాకుండా కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు వంటివి అందించాలి. ఎదిగే పిల్లలకు పాల సంబంధిత పదార్థాలు ఎంతో సహాయపడతాయి. అందులో ముఖ్యంగా నెయ్యి, పాలు ఎముకలు గట్టిదనానికి సహకరిస్తాయి. పెరుగులో ఉండే పోషకాలు జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది ఇందులో ఉండే కాల్షియం ఎముకలు దంతాలు గట్టిదనానికి సహాయపడుతుంది. ఇంట్లోనే తయారుచేసిన సూప్స్, వారానికి ఒకసారి అయినా వారు ఇష్టంగా తినే మాంసాహారాన్ని ఎక్కువ కారం మసాలా లేకుండా ఇస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.