అరటి ఆకులోనే కాదు ఈ ఆకుల్లో కూడా భోజనం చేయొచ్చు తెలుసా..?

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అటు పర్యావరణానికి , ఇటు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్స్‌లోనూ అరటి ఆకులో భోజనం పెట్టడం లేదనుకోండి. అరటి ఆకులో భోజనం చేస్తే భలే తృప్తిగా ఉంటుంది. మీకు తెలుసా కేవలం అరటి ఆకులే

అరటి ఆకులోనే కాదు ఈ ఆకుల్లో కూడా భోజనం చేయొచ్చు తెలుసా..?


అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అటు పర్యావరణానికి , ఇటు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కానీ ఇప్పుడు ఏ ఫంక్షన్స్‌లోనూ అరటి ఆకులో భోజనం పెట్టడం లేదనుకోండి. అరటి ఆకులో భోజనం చేస్తే భలే తృప్తిగా ఉంటుంది. మీకు తెలుసా కేవలం అరటి ఆకులే కాదు ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి. వాటిల్లోనూ భోజనం చేయొచ్చు. ఎప్పుడూ భోజనానికి ఆకులంటే అరటి ఆకునే కాదు.. ఇవి కూడా ఉన్నాయని తెలుసుకోండి.! ఆకుల్లో భోజనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ చూడండి.

అరటి ఆకు

నేటికీ దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అరటి ఆకులో ఆహారం తినాలనే నియమం ఉంది. ఆయా ప్రాంతాల్లోని రెస్టారెంట్స్‌కు వెళ్తే సంస్కృతి, సంప్రదాయం ప్రకారం అరటి ఆకులోనే భోజనం వడ్డిస్తారు. ఇది బయోడిగ్రేడబుల్, డిస్పోజబుల్ ప్లేట్ల వినియోగాన్ని తగ్గిస్తుంది. పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. ఈ ఆకు మీద ఉండే సహజమైన పూత ఆహారానికి సూక్ష్మమైన రుచిని అందిస్తుంది. దీని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జీర్ణక్రియలో సమర్థవంతంగా సహాయపడతాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పలాస ఆకు

పలాస ఆకు చాలా పవిత్రమైనది. తినడానికి బాగుంటుంది. అంతే కాకుండా ఈ ఆకులలో ప్రసాదాన్ని దేవుడికి సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారట. నేటికీ ఈ పచ్చి ఆకులని సేకరించి వాటితో పాత్రావళి తయారు చేసి అమ్మేవాళ్ళు ఉన్నారు. ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఆకలిని మెరుగుపరుస్తుంది. పలాస ఆకులను ప్లేట్లుగా ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలమైంది. ఎందుకంటే ఇవి బయోడిగ్రేడబుల్.

సాల్, టేకు ఆకులు

సాల్, టేకు ఆకుల పరిమాణం పెద్దది, గట్టిగా ఉంటాయి. వాటిలో తినడం చాలా సులభం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్ల ఆకులు సులభంగా దొరుకుతాయి. ఈ చెట్టు కలప ఫర్నిచర్ తయారీకి ఉపయోగిస్తారు. అత్యంత ఖరీదైన కలపలో ఇదీ ఒకటి. వీటిని సాధారణంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. సాల్, టేకు ఆకులు రెండూ సహజ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆహారంపై హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధించడంలో సహాయపడతాయి. ఈ ఆకులు ఆహారానికి అదనపు రుచిని జోడిస్తాయి. అంతే కాదు అరటి ఆకుల మాదిరిగానే ఇవి కూడా పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యవు.

తామర ఆకులు

లోటస్ కుకుంబర్, పోఖారా ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ దాని ఆకుల గురించి మీకు తెలుసా? తామర పువ్వుని లక్ష్మీదేవిని పూజించడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకులలో ఆహారాన్ని అందించే ప్రాంతాలు ఉన్నాయి. ఇవి సహజమైన హైడ్రోఫోబిక్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆహారం అంటుకోకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. వీటిలో తింటే ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. అంతే కాదు తామర ఆకు సువాసన భోజనానికి అంటుకుని మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే తామరపువ్వులు ఎప్పుడూ బురదలోనే ఉంటాయి కాబట్టి అందులోంచి వచ్చే ఆ ఆకులో బోజనం చేసేందుకు ఎవరూ సముకత చూపరు. మంచి ప్రదేశంలో ఉన్న తామర ఆకులలో భోజనం చేయొచ్చు.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.