అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా.. డైట్ లో ఈ ఆహారం చేరిస్తే సరి..!

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి.. రోజంతా ఎన్ని పనులతో సతమతమవుతున్న నిద్రతోనే అలసట మాయమైపోతుంది.. మరుసటి రోజు మళ్ళీ పూర్తి ఎనర్జీతో పనిచేయాలి అంటే కచ్చితంగా సరైన నిద్ర

అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా.. డైట్ లో ఈ ఆహారం చేరిస్తే సరి..!


ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి.. రోజంతా ఎన్ని పనులతో సతమతమవుతున్న నిద్రతోనే అలసట మాయమైపోతుంది.. మరుసటి రోజు మళ్ళీ పూర్తి ఎనర్జీతో పనిచేయాలి అంటే కచ్చితంగా సరైన నిద్ర తప్పనిసరి. అయితే ఈ రోజుల్లో చాలామందికి సరైన నిద్ర ఉండటం లేదు. దీంతో అలసట దరిచేరి జీవనశైలి మీద ప్రభావం పడుతుంది. అందుకే సరైన నిద్రకు చక్కని ఆహారం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Women Are More Likely To Suffer Sleepless Nights In The U.S. And Europe,  Study Finds

నిద్ర సరిగ్గా పట్టాలి అంటే డైట్లో కచ్చితంగా కొన్ని రకాల ఆహర పదార్థాలు చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి మెదడుని ఉల్లాసంగా ఉంచడమే కాకుండా నిద్రకు చక్కని పరిష్కారంగా ఉంటాయని తెలుస్తోంది అవి ఏంటంటే..

ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్..

ముఖ్యంగా ఓమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ చేపల్లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయని అంతేకాకుండా శరీరానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయని తెలుస్తోంది.

కొవ్వు పదార్థాలు తప్పనిసరి..

గుడ్ ఫ్యాట్ అధికంగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి మేలు జరగటమే కాకుండా నిద్రకు సంబంధించిన సమస్యలు దూరమైపోతాయని చెబుతున్నారు. వీటిలో ఉండే ట్రిప్ట్టా ఫ్యాట్ అనే అమైనో యాసిడ్ నిద్రకూ సహాయపడుతుంది.

గింజలు తప్పనిసరి..

గింజ ధానాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాదం, వేరుశనగ, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి వాటిలో సాటి యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా అత్యధికమే. వీటిని రోజులో ఏదో ఒక సమయంలో తరచు తీసుకోవడం వల్ల నిద్రకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి.

పచ్చని ఆకుకూరలు తప్పనిసరి..

సాధారణంగా అన్ని రకాల ఆకుకూరల్లో నైట్రేట్ ఎక్కువగా ఉంటాయి.. ఇవి శరీరం జీవక్రీ మీద ప్రభావం చూపిస్తాయి అంతేకాకుండా కుండ పనితీరుని మెరుగుపరిచి చక్కని నిద్ర పట్టేలా సహాయపడతాయి.

చక్కని పరిష్కారం ఎండుద్రాక్ష..

ఎండుద్రాక్షలో మెల్లటోనిన్ ఎక్కువగా ఉంటుంది.. ప్రొద్దుల్లో సైతం నిద్రలేని సమస్యను దూరం చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏ వయసు వారైనా వీటిని తరచు తీసుకోవడం వల్ల చక్కని నిద్ర సొంతమవుతుంది.

ఫైబర్ తప్పనిసరి..

ఫైబర్ అధికంగా ఉండే చిక్కుడు జాతి కాయగూరలు, పప్పు ధాన్యాలు వంటివి డైట్లో చేర్చుకోవడం వల్ల నిద్రలేమి సమస్యను తేలికగా దూరం చేసుకోవచ్చు. వీటితోపాటు రోజు సరిపడనంత నీళ్లు తాగటం తప్పనిసరి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.