శరీరంలో లివర్ సమస్య ఉందని భయమేస్తుందా?

లివర్.. శరీరంలోనే అతి పెద్ద గ్రంధి ఈ లివర్ పనితీరులో ఏమాత్రం సమస్యలు ఎదురైన పలు రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.. ముఖ్యంగా ఎవరికి సంబంధించిన సమస్యలు తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి.. అయితే ఎవరికైతే

శరీరంలో లివర్ సమస్య ఉందని భయమేస్తుందా?


లివర్.. శరీరంలోనే అతి పెద్ద గ్రంధి ఈ లివర్ పనితీరులో ఏమాత్రం సమస్యలు ఎదురైన పలు రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.. ముఖ్యంగా ఎవరికి సంబంధించిన సమస్యలు తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి.. అయితే ఎవరికైతే లివర్కు సంబంధించిన సమస్యలున్న ఏమో అని అనుమానం ఉందో వారికి దానిపై పూర్తి అవగాహన అత్యవసరం. అంతేకాకుండా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యమైన విషయం మరి లివర్కు సంబంధించిన సమస్యలకు ఏ టెస్టులు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం.

Fatty liver disease: What it is and what to do about it - Harvard Health

లివర్‌ ఎంజైమ్‌ టెస్ట్‌..

ALT, AST వంటి ఈ పరీక్షలు మీ రక్తంలోని కొన్ని ఎంజైమ్‌ల స్థాయిలను కొలుస్తాయి. లివర్‌ దెబ్బతిన్నప్పుడు, బాగా పనిచేయనప్పుడు ఈ ఎంజైమ్‌లు రక్తప్రవాహంలోకి లీక్‌ అవుతాయి. వీటితో పాటు ALT, AST ఎలివేటెడ్ స్థాయిలు రాబోయే లివర్ సమస్యలను సూచిస్తాయి.

బ్లడ్‌ క్లాట్‌ టెస్ట్‌..

లివర్‌ రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రొటీన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ప్రోథ్రాంబిన్ టైమ్ (PT), ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో (INR) వంటి పరీక్షలు ఈ గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేసే లివర్‌ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. లివర్‌ సరిగ్గా పని చేయకపోతే, రక్తం గడ్డ కట్టే సమయాన్ని చూపుతాయి.

వైరల్ హెపటైటిస్ పరీక్షలు..

హెపటైటిస్ అనేది లివర్‌ వాపు, ఇది తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. హెపటైటిస్ A, B, C, Eతో సహా వివిధ రకాల వైరల్ హెపటైటిస్ ఉన్నాయి. హెపటైటిస్ పరీక్షలు కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఈ వైరస్‌లలో దేనినైనా గుర్తించడానికి సహాయపడతాయి.

ఇమేజింగ్ టెస్ట్‌లు..

రక్త పరీక్షలతో పాటు, అల్ట్రాసౌండ్, CT స్కాన్, MRI వంటి ఇమేజింగ్ పద్ధతులు లివర్‌ పరిస్థితిని తెలుసుకోగలము. ఈ పరీక్షలు కణితులు, తిత్తులు, ఫ్యాటీ లివర్‌ వంటి అసాధారణ సమస్యలను గుర్తిస్తాయి.
ఈ పరీక్షలను చేయించుకుంటే.. లివర్‌ ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేయవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించవచ్చు.

బిలిరుబిన్ టెస్ట్..

బిలిరుబిన్ అనేది ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం సమయంలో ఉత్పత్తి అయ్యే పసుపు వర్ణద్రవ్యం. కాలేయం సరిగ్గా పని చేయకపోతే.. బిలిరుబిన్‌ స్థాయిలు పెరుగుతాయి. ఇది కామెర్లుకి దారితీస్తుంది. దీని వల్ల చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారతాయి. బిలిరుబిన్‌ టెస్ట్‌ రక్తంలో ఈ వర్ణద్రవ్యాన్ని కొలవడానికి సహాయపడుతుంది.

ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ (ALP) టెస్ట్‌..

ALP అనేది కాలేయంతో సహా వివిధ కణజాలాలలో కనిపించే ఎంజైమ్. ఎలివేటెడ్ ALP స్థాయిలు లివర్‌ సమస్యలు, పిత్త వాహికలలో అడ్డంకిని సూచిస్తాయి. ఈ టెస్ట్‌ ఎదైనా కాలేయం, బైల్‌ ప్రవాహంలో సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

Gamma-Glutamyl Transferase (GGT) టెస్ట్..

GGT అనేది రక్త పరీక్ష ద్వారా తెలుసుకునే లివర్‌ ఎంజైమ్. GGT స్థాయిలు అధికంగా ఉంటే లివర్‌ దెబ్బతినడం, మద్యపానంతో సంబంధం ఉంటుంది. ఈ కారకాల వల్ల రాబోయే లివర్‌ సమస్యలను గుర్తించడంలో ఈ టెస్ట్‌లను పరీక్ష సహాయపడుతుంది.

అల్బుమిన్ పరీక్ష..

అల్బుమిన్ కాలేయం ఉత్పత్తి చేసే ప్రోటీన్. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. అల్బుమిన్ తక్కువ స్థాయిలు కాలేయం పనిచేయకపోవడం, పోషకాహార లోపాన్ని సూచిస్తాయి. ఈ ముఖ్యమైన ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసే కాలేయ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.