డయబెటిస్‌కు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది తెలుసా..? మందులు కూడా వాడక్కర్లేదు..!

షుగర్‌ వ్యాధితో బాధపడుతూ.. రోజూ ఒక ట్యాబ్లెట్‌ వేసుకుంటూ నేడూ చాలా మంది చేదు జీవితం అనుభవిస్తున్నారు. పోనీ ఇంత చేసినా అది కంట్రోల్‌లో ఉంటుందా అంటే లేదు. ఒక్కోసారి అమాంత షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి. నిజానికి షుగర్‌ పెద్ద వ్యాధి ఏం కాదు, వంటింట్లో ఉండే పదార్థాలతోనే షుగర్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. మీరు అల్లం వంటల్లో వాడుతూనే ఉంటారు

డయబెటిస్‌కు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది తెలుసా..? మందులు కూడా వాడక్కర్లేదు..!


షుగర్‌ వ్యాధితో బాధపడుతూ.. రోజూ ఒక ట్యాబ్లెట్‌ వేసుకుంటూ నేడూ చాలా మంది చేదు జీవితం అనుభవిస్తున్నారు. పోనీ ఇంత చేసినా అది కంట్రోల్‌లో ఉంటుందా అంటే లేదు. ఒక్కోసారి అమాంత షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి. నిజానికి షుగర్‌ పెద్ద వ్యాధి ఏం కాదు, వంటింట్లో ఉండే పదార్థాలతోనే షుగర్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. మీరు అల్లం వంటల్లో వాడుతూనే ఉంటారు. అల్లంలో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. ఎన్నో వ్యాధులను చిన్న అల్లం ముక్కతో తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  

ఇన్సులిన్ నిరోధ‌క‌త కార‌ణంగా త‌లెత్తే టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, ఊబ‌కాయం వంటి వాటిని టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డ‌డానికి ముఖ్య కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే జన్యుప‌రంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంది. అల్లం ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను త‌గ్గించడంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇరాన్ దేశ శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 

అల్లంతో ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతుందా..?

అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. దీంతో ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ క‌ణాల్లోకి సుల‌భంగా వెళ్తుంది. త‌ద్వారా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని రోజుకు 2 నుంచి 5 గ్రాముల మోతాదుల్లో తీసుకోవ‌డం వ‌ల్ల 12 రోజుల్లోనే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు 12 శాతం త‌గ్గుతున్నాయ‌ని నిపుణులు వెల్ల‌డించారు. ప్ర‌తిరోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని దీంతో టైప్ 2 డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.
అయితే అల్లాన్ని నేరుగా నూనెలో వేసి వేయించ‌డం వ‌ల్ల దాని వ‌ల్ల పోషకాలు న‌శిస్తాయి.. అలా వేయించిన అల్లాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా ఫ‌లితం ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచిన వెంటనే పరగడుపునే చిన్న అల్లం ముక్కను నేరుగా తినేయొచ్చు. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్నవారు అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణ‌లు చెబుతున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.