బెండకాయల గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌.. తినకపోతే చాలా లాస్‌ అవుతారు..!!

మార్కెట్‌కు వెళ్తే.. అందరూ తెచ్చే కూరగాయాల్లో.. బెండకాయ, దొండకాయ, టమోటా, బంగాళదుంప కామన్‌గా ఉంటాయి. ఇవి అయితే మనకు అందుబాటులో ఉంటాయి.. వీటి ధరలు కూడా తక్కువగానే ఉంటాయని మనం ఎక్కువగా వీటినే తెస్తుంటాం.. అయితే.. మీకు బెండకాయల గురించి కొన్ని అద్భుతమైన విషయాలు

బెండకాయల గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌.. తినకపోతే చాలా లాస్‌ అవుతారు..!!


మార్కెట్‌కు వెళ్తే.. అందరూ తెచ్చే కూరగాయాల్లో.. బెండకాయ, దొండకాయ, టమోటా, బంగాళదుంప కామన్‌గా ఉంటాయి. ఇవి అయితే మనకు అందుబాటులో ఉంటాయి.. వీటి ధరలు కూడా తక్కువగానే ఉంటాయని మనం ఎక్కువగా వీటినే తెస్తుంటాం.. అయితే.. మీకు బెండకాయల గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాలి. ఎందుకంటే.. కొంతమంది అది జిడ్డుగా ఉంటుందని తినరు.. అసలు బెండకాయ గొప్పతనం తెలిస్తే.. కళ్లకద్దుకోని తింటారు తెలుసా..?  

బెండకాయలను ఇంగ్లిస్‌లో లేడీ ఫింగర్స్‌, ఓక్రా అని కూడా పిలుస్తారు. లేత బెండకాయలను తెచ్చి వండితే ఎలా చేసినా కూర భలేగా ఉంటుంది. అయితే కొందరు బెండకాయల్లో ఉండే జిగురు కారణంగా వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ బెండకాయలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
బెండకాయల్ల ఫాస్ఫరస్, విటమిన్‌ ఎ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ముఖ్యంగా పిల్లలు వీటిని తింటే చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటారు.. అసలు విషయం బెండకాయలు తింటే.. బ్రెయిన్‌ బాగా పనిచేస్తుంది అంతే..!
బెండకాయల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల మెదడును చురుగ్గా ఉంచుతాయి. బెండకాయలను తింటే మెదడు చురుగ్గా ఉంటుందని పెద్దలు కూడా చెబుతుంటారు. అది అక్షరాలా నిజమే. పిల్లలకు వీటిని తినిపించడం వల్ల మేథస్సు, తెలివితేటలు పెరుగుతాయి.
బెండకాయలను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా బెండకాయల్లో ఉండే ఫైబర్‌ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
బెండకాయలను తినడం వల్ల రక్తంలో అధికంగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. బెండకాయల్లో పెక్టిన్‌ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను సంరక్షిస్తుంది. గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బెండకాయల్లో ఉండే పాలిఫినాల్స్‌ క్యాన్సర్లు రాకుండా రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
బరువు తగ్గాలనుకునేవారు రోజూ బెండకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు.
బెండకాయల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. బెండకాయల్లో ఉండే విటమిన్‌ బి9 ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర బాగా పడుతుంది.
వీటిని రోజూ తినలేమని అనుకునేవారు జ్యూస్‌ తీసి 30 ఎంఎల్‌ మోతాదులో రోజూ పరగడుపునే తాగవచ్చు. లేదా రాత్రి పూట రెండు బెండకాయలను నిలువుగా కట్‌ చేసి నీళ్లలో వేసి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగవచ్చు. దీంతో షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.. పైన చెప్పిన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.