మనిషిని హ్యాపీగా ఉంచే ఎక్సర్సైజులు ఇవే.. వీటిని నిత్య జీవితంలో భాగం చేసుకుంటే సంతోషం మీ సొంతం!

మారిపోతున్న జీవనశైలితో మనుషుల అలవాట్లు గతి తప్పుతున్నాయి. అలాగే పని చేసే సమయాలు సైతం సక్రమంగా ఉండకపోవటంతో తినే సమయం, నిద్రపోయే సమయం మారిపోతూ ఉంటుంది. దీని వలన శరీరంలో హార్మోన్లు

మనిషిని హ్యాపీగా ఉంచే ఎక్సర్సైజులు ఇవే.. వీటిని నిత్య జీవితంలో భాగం చేసుకుంటే సంతోషం మీ సొంతం!


మారిపోతున్న జీవనశైలితో మనుషుల అలవాట్లు గతి తప్పుతున్నాయి. అలాగే పని చేసే సమయాలు సైతం సక్రమంగా ఉండకపోవటంతో తినే సమయం, నిద్రపోయే సమయం మారిపోతూ ఉంటుంది. దీని వలన శరీరంలో హార్మోన్లు గతి తప్పి తీవ్రమైన ఒత్తిడికి కారణం అవుతున్నాయి. అయితే నిత్య జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకుంటే ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చు అని తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల వ్యాయమాలు శరీరంలో ఆనందంగా ఉండే హార్మోన్లను పెంచుతాయని తెలుస్తోంది.

నిత్యజీవితంలో క్రమం తప్పకుండా వ్యాయమాన్ని భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని కలిగించే స్ట్రెస్ హార్మోన్లో తగ్గడంతో పాటు హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయని సమాచారం. అయితే ఆ హ్యాపీ ఎక్సర్సైజులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

యోగా..

మనిషి ప్రశాంతంగా ఉండాలంటే రోజు కచ్చితంగా కాస్త సమయం యోగాకి కేటాయించాలి. ఈ సమయంలో పూర్తిగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఎలాంటి ఒత్తిడి దరిచేరదు. ఈ సమయంలో మెదడుకి కావాల్సిన ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. దీంతో మానసిక స్థితి మెరుగుపడుతుంది.

వాకింగ్..

నిత్యజీవితంలో వాకింగ్ భాగం చేసుకోవాలి. వారంలో కనీసం నాలుగు రోజులపాటు కొంత సమయం నడకకి కేటాయించాలని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల అధిక బరువు సమస్య అదుపులో ఉండటంతో పాటు దీర్ఘకాలం వేధించే ఒత్తిడి సైతం దరిచేరదు.

ఈత..

ఈత రానివారు కచ్చితంగా కాస్త సమయం ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. మనిషి తనను తాను మరిచిపోయి చిన్న పిల్లాడిలా నీటిలో ఈదితే మనసులో ఉన్న భారం అంతా తొలగిపోవడమే కాకుండా ఒత్తిడి సైతం దూరం అవుతుందని తెలుస్తోంది. ఈ సమయంలో మానసిక ప్రశాంతత దరిచేరుతుందని చెబుతున్నారు.

రన్నింగ్..

ఏ వయసు వారేనా రన్నింగ్ చేస్తే శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయని తెలుస్తోంది. ఈ సమయంలో ఎండోఫిన్ విడుదలవుతుంది. ఇది మనసుని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే పరుగులు మొదలు పెట్టాలి అనుకునే వారు మాత్రం నెమ్మదిగా మొదలు పెట్టడం మేలు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.