కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..!

మనిషికి ఉన్న అవయవాల్లో కళ్లు చాలా ప్రధానమైనవి.. ఇవి ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా ఇస్తాయి.. ఒక వ్యక్తి కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో.. ఆ వ్యక్తి చూసేందుకు కూడా అంతే అందంగా కనిపిస్తారు. కళ్ల కింద నల్లగా ఉండటం, కనుబొమ్మలు

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే.. ఈ టిప్స్‌ ట్రై చేయండి..!


మనిషికి ఉన్న అవయవాల్లో కళ్లు చాలా ప్రధానమైనవి.. ఇవి ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా ఇస్తాయి.. ఒక వ్యక్తి కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో.. ఆ వ్యక్తి చూసేందుకు కూడా అంతే అందంగా కనిపిస్తారు. కళ్ల కింద నల్లగా ఉండటం, కనుబొమ్మలు అసలు కనిపించకపోవడం, ఎర్రబడటం వీటన్నిటి వల్ల మీరు నీరసంగా, అందవిహీనంగా కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఐబ్రోస్‌ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. వాటిని మంచిగా షేప్‌ వచ్చేలా తీయించుకుంటారు. కానీ చాలా మంది అమ్మాయిలకు ఐబ్రోస్‌ పలుచుగా ఉంటాయి.. చూడ్డానికి ఏం అంత మంచిగా ఉండదు.. నల్లగా ఒత్తుగా ఐబ్రోస్ ఉన్న అమ్మాయిలు ఐబ్రోస్‌ చేయించుకుంటే లుక్‌ అదిరిపోతుంది. కళ్లతోనే కట్టిపడేస్తారు. మీకు కూడా ఒత్తుగా ఉండే కనుబొమ్మలు కావాలంటే.. ఇక ఐ పెన్సిల్‌ను వాడటం ఆపేసి.. ఈ చిట్కాలను ట్రై చేయండి..!

ఆముదం.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఆముదం చిక్క‌గా ఉంటుంది. ఆముదం నూనెలో దూదిని ముంచి రోజూ రాత్రి ప‌డుకునే ముందు క‌నుబొమ్మ‌ల మీద రాయాలి. ఉద‌యాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆముదంలో ఉండే పోష‌కాలు క‌నుబొమ్మ‌లు ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుంగా చేయ‌డం వ‌ల్ల క‌నుబొమ్మ‌లు ఒత్తుగా పెరుగుతాయి. అంతేకాకుండా ఆముదంలో ఉండే పోష‌కాలు చ‌ర్మానికి కాంతిని కూడా ఇస్తాయి.

క‌నుబొమ్మ‌లను ఒత్తుగా పెరిగేలా చేయ‌డంలో క‌ల‌బంద గుజ్జు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ల‌బంద గుజ్జును క‌నుబొమ్మ‌ల మీద రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. 20 నిమిషాల త‌రువాత నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. 

ఉల్లిపాయ ర‌సాన్ని ఉప‌యోగించి కూడా మ‌నం క‌నుబొమ్మ‌లు ఒత్తుగా పెరిగేలా చేయ‌వ‌చ్చు. ఉల్లిపాయ ర‌సంలో దూదిని ముంచి క‌నుబొమ్మ‌లపై రాయాలి. ఇలా రాసిన గంట త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల క‌నుబొమ్మ‌లు ఒత్తుగా పెరుగుతాయి.

బాదం నూనెను రోజూ క‌నుబొమ్మ‌ల మీద రాసి నూనె చ‌ర్మంలోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా క‌నుబొమ్మ‌లు ఒత్తుగా పెరుగుతాయి. 

ఆలివ్ నూనె కూడా క‌నుబొమ్మ‌ల‌ను ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఆలివ్ నూనెను క‌నుబొమ్మ‌ల మీద రాసి 10 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఈ నూనెలో ఉండే పోష‌కాలు క‌నుబొమ్మ‌ల‌ను నల్ల‌గా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.  

ప‌చ్చిపాల‌ల్లో దూదిని ముంచి క‌నుబొమ్మ‌ల మీద రాయాలి. గంట త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా క‌నుబొమ్మ‌లు ఒత్తుగా పెరుగుతాయి.

ప‌లుచ‌టి క‌నుబొమ్మ‌లు క‌లిగిన వారు విట‌మిన్ ఇ క్యాప్సుల్స్‌ను ఉప‌యోగించినా కూడా చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంది. 

అవిసెగింజల జెల్‌ను రోజు నిద్రపోయేముందు రాసినా కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.