ఉదయాన్నే అల్పాహారంగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే నిత్యం యవ్వనంతో మెరిసిపోవడం సాధ్యమే!

నిత్యం యవ్వనంగా మెరిసిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఈరోజుల్లో పెరిగిపోతున్న ఒత్తిడి సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఉదయాన్నే అల్పాహారం మానేయటం సరిగ్గా నీళ్లు తాగకపోవడం వంటి ఎన్నో కారణాలు చర్మాన్ని

ఉదయాన్నే అల్పాహారంగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే నిత్యం యవ్వనంతో మెరిసిపోవడం సాధ్యమే!


నిత్యం యవ్వనంగా మెరిసిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఈరోజుల్లో పెరిగిపోతున్న ఒత్తిడి సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఉదయాన్నే అల్పాహారం మానేయటం సరిగ్గా నీళ్లు తాగకపోవడం వంటి ఎన్నో కారణాలు చర్మాన్ని నిర్జీవంగా మార్చి చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలని తీసుకువస్తున్నాయి.

ఉదయాన్నే తీసుకునే అల్పాహారం శరీరానికి శక్తిని అందించడంతోపాటు ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడేస్తుంది ముఖ్యంగా మంచి పోషకాహారం తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది అయితే ఉదయాన్నే అల్పాహారంలో వేటిని చేర్చుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.
బొప్పాయి.. ఉదయాన్నే ఆహారంలో బొప్పాయిని చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ముఖ సౌందర్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియ సమస్యలను దూరం చేసి శరీరానికి మేలు చేస్తాయి. 
ఓట్స్.. అల్పాహారంగా ఓట్స్ చాలా మంచిది. దీన్ని రోజూ ఉదయాన్నే తింటే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండొచ్చు.  కొబ్బరి పాలలో ఉడికించిన ఓట్స్ తీసుకోండి. తర్వాత దాని మీద కొంచెం దాల్చిన చెక్క పొడిని చల్లి ఉదయాన్నే తినాలి. దీన్ని రోజూ తింటే యవ్వనంగా, కాంతివంతంగా ఉండొచ్చు.
చియా విత్తనాలు.. చాలా చిన్నగా ఉండే ఈ విత్తనాలే మీ ముఖ సౌందర్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ముఖాన్ని చాలా మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ముఖంపై ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. 
గుడ్డు.. గుడ్డులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి వీటిలో విటమిన్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అందుకే ఉదయాన్నే అల్పాహారంగా గుడ్డును తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కేస సౌందర్యం పెరగడంతో పాటు శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అంది నీరసం దరిచేరదు.
గ్రీన్ టీ.. మీరు మరింత యవ్వనంగా కనిపించడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే నిద్రలేచి కాఫీ, టీ కాకుండా గ్రీన్ టీ తాగితే ఆరోగ్యం, ముఖ ఆరోగ్యం రెట్టింపు అవుతుందని తెలుస్తోంది గ్రీన్ టీ లెమన్ టీ వంటివి ఏమి తీసుకున్న చర్మం సౌందర్యవంతంగా మారుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.