ప్రొటీన్‌ లోపమా.. శనగలతో ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ చేసి తినండి..!

మనకు ప్రోటీన్‌ చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్‌ లోపిస్తే కండరాలు క్షీణించడం, రోగనిరోధక పనితీరు బలహీనపడడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, రక్తహీనత ఇలా అనేక రోగాలకు దారితీస్తుంది. రోజూ సరిపడా ప్రోటీన్‌ పొందాలంటే ప్రోటీన్‌ ఉన్న

ప్రొటీన్‌ లోపమా.. శనగలతో ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ చేసి తినండి..!


మనకు ప్రోటీన్‌ చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్‌ లోపిస్తే కండరాలు క్షీణించడం, రోగనిరోధక పనితీరు బలహీనపడడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, రక్తహీనత ఇలా అనేక రోగాలకు దారితీస్తుంది. రోజూ సరిపడా ప్రోటీన్‌ పొందాలంటే ప్రోటీన్‌ ఉన్న ఆహారాలను తినాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో తెల్ల శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటాం. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్‌ల‌తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే బ్రేక్ ఫాస్ట్‌ను ఈరోజు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎవరైతే ప్రోటీన్‌ లోపంతో బాధపడుతున్నారో అలాంటివారు డైలీ ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను తింటే బాడికి చక్కగా ప్రోటీన్‌ అందుతుంది. 
High Protein Breakfast: ప్రోటీన్ ఫుడ్ ను బ్రేక్ ఫాస్ట్ లో తినాలని చెప్పేది  ఇందుకోసమే..

 శ‌న‌గ‌ల బ్రేక్ ఫాస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాత్రంతా నాన‌బెట్టిన తెల్ల శ‌న‌గ‌లు( కాబూలీ శ‌న‌గ‌లు) – ఒక క‌ప్పు, 
త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, 
అల్లం ముక్క‌లు – ఒక టీ స్పూన్, 
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, 
పెరుగు – అర క‌ప్పు, 
ఉప్పు – త‌గినంత‌, 
ప‌సుపు – పావు టీ స్పూన్, 
జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, 
ఇంగువ – చిటికెడు, 
ర‌వ్వ – 3 టేబుల్ స్పూన్స్, 
చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, 
నీళ్లు – పావు క‌ప్పు.

శ‌న‌గ‌ల బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలంటే..

ఒక జార్‌లో శ‌న‌గ‌లు, పచ్చిమిర్చి, పెరుగు, అల్లం, కొత్తిమీర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పండి. ఇప్పుడు ఇప్పుడు స్ట‌వ్ మీద క‌ళాయి లేదా పెన్నాన్ని పెట్టి అర టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న శ‌న‌గ‌ల మిశ్ర‌మాన్ని తీసుకుని ఊత‌ప్పం లాగా వేసుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు కాల్చుకోవాలి. త‌రువాత మ‌రో వైపుకు తిప్పి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే శ‌న‌గ‌ల బ్రేక్ ఫాస్ట్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా ఇలాగే తిన్నా లేదా చ‌ట్నీతో తిన్నా కూడా టేస్ట్‌ అదిరిపోతుంది. ఈ విధంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా రుచిగా, అలాగే మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలా శ‌న‌గ‌ల‌తో ఇలా బ్రేక ఫాస్ట్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. జనరల్‌గా హెల్తీ ఆహారాలు అంటే చప్పగా ఉంటాయి, అస్సలు రుచిగా ఉండవు అనుకుంటారు. కానీ ఈ టిఫెన్‌ మీరు ఒక్కసారి టేస్టే చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు, అంత రుచిగా ఉంటుంది. వారంలో ఒక్కసారి అయినా ఇది చేసి తినండి. మంచి ప్రోటీన్‌ అందుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.