Ragi : అందుకే రాగులు రోజు ఆహారంలో భాగం కావాల్సిందేనట!

Ragi : మారిపోతున్న జీవనశైలిలో మనిషి ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నాడు. ఇందుకు గాను చిరుధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చని తెలుస్తోంది.

Ragi : అందుకే రాగులు రోజు ఆహారంలో భాగం కావాల్సిందేనట!


Ragi : మారిపోతున్న జీవనశైలిలో మనిషి ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నాడు. ఇందుకు గాను చిరుధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చని తెలుస్తోంది.
చాలా మంది చిరుధాన్యాలు అనేటప్పటికీ పాతకాలపు పద్ధతిగానే భావిస్తారు. కానీ ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ముఖ్యంగా రాగులు శరీరాన్ని పటిష్టంగా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

రాగుల్లో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. అందుకే రోజు రాగులనే తీసుకోవడం వల్ల ఎదిగే పిల్లలకి ఎలాంటి సమస్యలు రావు. వారి శరీరం పటిష్టంగా తయారవుతుంది. అలాగే దంతాలు, కండరాలు బలంగా మారుతాయి.
అధిక బరువును అదుపులో ఉంచుకోవడానికి చాలామంది వ్యాయామాన్ని ఎంచుకుంటారు. అయితే బరువుగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సమయంలో రోజు రాగులు తీసుకోవడం వల్ల వ్యాయామం సమయంలో వచ్చే ఆవేశాన్ని అదుపులో ఉంచుతుందని తెలుస్తోంది.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పోలిక్ యాసిడ్ లభిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే నీరసాన్ని అదుపులో ఉంచుతుంది. తల్లిని బిడ్డని ఆరోగ్యంగా ఉంచడంలో రాగులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గాలి అనుకునేవారు రోజు రాగి జావను తీసుకోవడం వల్ల శరీరంలో ఆధారంగా పేరుకుపోయిన నీరంతా బయటకు పోతుంది.
మధుమేహం సమస్యతో బాధపడేవారు శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి రాగులు చక్కని పరిష్కారం రాగులు రక్తంలో ఉండే చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.