మగాళ్లు బీ అలర్ట్.. లైంగిక సామర్థ్యం కోసం ఇవి పక్కా పాటించాల్సిందే.. లేదంటే!

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితం..  పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దాంతో ఎంతోమంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల  చుట్టూ తిరుగుతున్నారు. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఇలాంటి

మగాళ్లు బీ అలర్ట్.. లైంగిక సామర్థ్యం కోసం ఇవి పక్కా పాటించాల్సిందే.. లేదంటే!


ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితం..  పురుషుల లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దాంతో ఎంతోమంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల  చుట్టూ తిరుగుతున్నారు. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

సెక్స్ సామర్థ్యం కోసం మందులు వాడే వారి మరణాలు పెరుగుతున్నాయి... ఎందుకు? -  BBC News తెలుగు


వ్యాయామం తప్పనిసరి..

సైక్లింగ్, స్విమ్మింగ్తో పాటు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఫీల్ గుడ్ ఎండార్ఫిన్‌లను విడుదల అవుతాయి. ఫలితంగా స్పెర్మ్ క్వాలిటీ మెరుగవుతుంది.

ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ కు దూరం..

టెస్టోస్టిరాన్ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి.  అందుకే.. ఈ ప్రాసెస్డ్, జంక్‌ఫుడ్‌ను దూరం పెట్టాలి. వీటికి బదులుగా గుడ్లు, పండ్లు, వాల్‌నట్స్‌, కూరగాయలతో సహా ప్రోటీన్స్ ఉండే ఆహారాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్‌లతో కూడిన ఆహారాన్ని తినాలి. ఫలితంగా  లైంగిక ఆరోగ్యం మెరుగవుతుంది. స్పెర్మ్ క్వాలిటీ కూడా మెరుగవుతుంది.

ధూమపానం మనేయల్సిందే..

ధూమపానం మరొక  స్ట్రెస్ బస్టర్. ఇది స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేయకూడదు. ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తుంది.

రిలాక్స్‌గా ఉండాలి..

రోజువారీ బిజీ జీవితంలో ఒత్తిడి  సర్వసాధారణం. దీర్ఘకాలిక ఒత్తిడి లేదా ఆందోళన  లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి  శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచి.. టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి డిప్రెషన్, ఆందోళన, మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే.. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.