తరచూ సెక్స్‌ చేయడం వల్ల వజైనా వదులుగా మారుతుందా..?

ఒకప్పుడు పెళ్లి తర్వాతే చాలా మంది శృంగారంలో పాల్గొనేవారు.. కానీ కాలం మారింది.. ప్రేమించిన అబ్బాయితో చాలా మంది అమ్మాయిలు ప్రొసీడ్‌ అవుతున్నారు. పైగా వాళ్లు అది తప్పుగా కూడా ఫీల్‌ అవడం లేదు. కలిసి బతికే అవకాశం ఎలాగూ లేదు

తరచూ సెక్స్‌ చేయడం వల్ల వజైనా వదులుగా మారుతుందా..?


ఒకప్పుడు పెళ్లి తర్వాతే చాలా మంది శృంగారంలో పాల్గొనేవారు.. కానీ కాలం మారింది.. ప్రేమించిన అబ్బాయితో చాలా మంది అమ్మాయిలు ప్రొసీడ్‌ అవుతున్నారు. పైగా వాళ్లు అది తప్పుగా కూడా ఫీల్‌ అవడం లేదు. కలిసి బతికే అవకాశం ఎలాగూ లేదు.. కాబట్టి.. ఇలా అయినా కొన్ని జ్ఞాపకాలను కూడబెట్టుకుందాం అనే ఆలోచన నేటి తరం యువతలో బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే శృంగారం అనేది చేసినంత సేపు బానే ఉంటుంది. కానీ దానివల్ల వచ్చే పర్యావసానం మాత్రం అమ్మాయిలను బాగా వేధిస్తుంది. బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్‌ చేసిన తర్వాత.. అమ్మాయిలు నెక్స్ట్‌ వచ్చే పిరియడ్స్‌ కోసం ఎదురుచూస్తారు. అది ఎక్కడ మిస్‌ అయితే. ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అవుతుందేమో అన్న భయం.. ఇంకోటి.. తరచూ సెక్స్‌ చేయడం వల్ల వర్జైనా వదులుగా మారిపోతుందా..? ఒకవేళ అలా అయితే.. రేపు వచ్చే భర్తకు మ్యాటర్‌ తెలిసిపోయి.. అనవసరంగా లేనిపోని లొల్లి.. ఇలాంటి చాలా భయాలు అమ్మాయిలకు ఉన్నాయి.. వజైనా విషయంలో మీ అపోహల మా వాస్తవాలు చూద్దామా..!

అపోహ: ఎక్కువ సార్లు సెక్స్ చేయడం వల్ల యోని లూజ్ అవుతుంది

వాస్తవం: ఫోర్ ప్లే వల్ల వజైనా వ్యాకోచం చెందుతుంది. అయితే మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. రబ్బరులాగే సాగదీసినా కూడా యథాస్థితికి వచ్చే గుణం వజైనాకు ఉంటుంది.

అపోహ: వజైనా ఎప్పుడూ బిగుతుగానే ఉంటుంది.

వాస్తవం: గర్భదారణ, వయసు ఇంకేమైనా కారణాల వల్ల వజైనా స్టిఫ్‌నెస్‌లో మార్పు రావచ్చు. ఇది ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది.

అపోహ: ప్రతి మహిళ భావప్రాప్తి పొందుతుంది

వాస్తవం: క్లిటరల్, వజైనా స్టిమ్యులేషన్ వల్ల మహిళల్లో భావప్రాప్తి కలగొచ్చు. యోని భావప్రాప్తి అంటూ ప్రత్యేకంగా ఏముండదు.

 అపోహ: వజైనాను ఫెమినిన్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి

వాస్తవం: వజైనా సొంతంగా దానికదే శుభ్రం చేసుకునే అవయవం. దాని పీహెచ్ స్థాయులు అదే నియంత్రణలో ఉంచుకుంటుంది. రసాయనాలు, వాష్ లు వాడటం వల్ల ఆ పీహెచ్ స్థాయుల్లో మార్పు

వస్తుంది. ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. గోరువెచ్చని నీళ్లు, ఎలాంటి పరిమళాలు లేని సబ్బుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

అపోహ: వజైనా నుంచి వాసన రావడం అసాధారణం

వాస్తవం: కొన్ని సార్లు యోని దగ్గర వాసన రావడం అనేది ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు. కానీ చాలా తక్కువ వాసన అనేది సాధారణం. రుతుచక్రంలో వివిధ రోజుల్లో ఈ వాసనలో మార్పు కూడా ఉండొచ్చు.

అపోహ: వర్జినిటీని హైమెన్ నిర్ణయిస్తుంది

వాస్తవం: వర్జినిటీ అనేది చాలా సున్నితమైన విషయం. హైమెన్ పొర ఉన్నా లేకపోయినా, ఆకారంలో, సైజులో మార్పున్నా అది వర్జినిటీని నిర్ణయించదు. కఠినమైన శారీరక కసరత్తులు, కష్టమైన పనులు, ట్యాంపన్లు వాడటం వల్ల కూడా హైమెన్ పొర పోతుంది.

అపోహ: వజైనల్ డిశ్చార్జి ఇన్ఫెక్షన్ సూచిస్తుంది

వాస్తవం: వజైనల్ డిశ్చార్జి సాధారణం. వజైనా శుభ్రపరచడంలో, లూబ్రికేషన్ కోసం ఇది సాయపడుతుంది. కానీ రంగు, వాసన, చిక్కదనంలో మార్పు ఇన్ఫెక్షన్ సూచించొచ్చు. దీనికి తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.