నగ్నంగా పడుకుంటే బరువు తగ్గొచ్చట..ఇంకా ఈ చిట్కాలతో కూడా..

ఈరోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. తగ్గేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే కూడా బరువు తగ్గుతారని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు తెలుసా..? నగ్నంగా నిద్రపోతే.. బరువు తగ్గొచ్చని తాజా స్టడీలో తెలిసింది. నగ్నంగా నిద్రపోతే బరువు తగ్గడమేంట్రా అనుకుంటున్నారా..? అదెలా సాధ్యమో పరిశోధకులు చెబుతున్నారు. మీరే చూడండి.

నగ్నంగా పడుకుంటే బరువు తగ్గొచ్చట..ఇంకా ఈ చిట్కాలతో కూడా..



ఈరోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. తగ్గేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే కూడా బరువు తగ్గుతారని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు తెలుసా..? నగ్నంగా నిద్రపోతే.. బరువు తగ్గొచ్చని తాజా స్టడీలో తెలిసింది. నగ్నంగా నిద్రపోతే బరువు తగ్గడమేంట్రా అనుకుంటున్నారా..? అదెలా సాధ్యమో పరిశోధకులు చెబుతున్నారు. మీరే చూడండి.
 యూఎస్‌కు చెందిన నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ వారి పరిశోధనలో నగ్నంగా నిద్రించడం వల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది. అందువల్ల జీవక్రియలు వేగవంతం అవుతాయి. ఫలితంగా వేగంగా కాలరీలు ఖర్చవుతాయని తేలింది. రాత్రి నిద్రకి బర్త్ డే సూట్ ఉపయోగించమని నిపుణుల సలహా. కానీ, అది సాధ్యమేనా?

ఈ జాగ్రత్తలు పాటించండి..

వేడివేడిగా వండిన పాస్తా, ఆలు తినకండి. మీరు తీసుకునే కార్బోహైడ్రేట్లను చల్లారిన తర్వాత తినండి. ఎందుకంటే చల్లారిన కార్బోహైడ్రేట్లు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్‌తో ఉంటాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారపదార్థాలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావనలో ఉంచుతాయి. అందువల్ల తరచుగా ఏదైనా తినాలనే ఆలోచన రాదు. అందుకే రేపటికి వాడాలనుకునే కార్బోహైడ్రేట్లను రాత్రి వండి పెట్టేసుకోవడం మంచిదని నిపుణుల సలహా.
తరచుగా తియ్యగా తినాలనే కోరిక కలుగుతుంటే మింట్ గమ్ నమలడం, లేదా బ్రష్ చేసుకోవడం ద్వారా ఈ కోరికకు అడ్డుకట్ట వెయ్యొచ్చని నిపుణులు అంటున్నారు. మింట్ స్వీట్ క్రేవింగ్స్ ఆపడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుందట.
కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గుతారనుకోవడం మీ భ్రమే. తక్కువ తినడం, లేదా భోజనం మానెయ్యడంతో పెద్ద ఫలితాలు ఉండవనే అంటున్నారు. ఆకలిని పట్టించుకోకుండా చాలా సమయం పాటు ఉంటే ఆకలి వల్ల తినాలనే కోరిక చాలా బలంగా పుడుతుంది. అప్పుడు హై క్యాలరీడ్ ఫూడ్ ఎక్కువ తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎక్కువ ఆకలి అయ్యే వరకు ఆగకూడదు. కొద్దిగా ఆకలి వేయగానే ఏదైనా పోషకాహారం తీసుకోవాలి. ఇది బరువు పెరగకుండా ఆపుతుందని అనడం లో సందేహం అక్కర్లేదు.
ఆహారం నుంచి వచ్చే కమ్మని వాసన ఆకలిని మరింత పెంచుతుంది. తినాలనే కోరిక చాలా బలంగా కలిగిస్తుంది. ఘుమఘుమలాడే పరిసరాల నుంచి దూరంగా ఉండడం వల్ల తినాలనే కోరికకు దూరంగా ఉండొచ్చు. అనవసరపు మంచింగ్‌ను ఇలా నిరోధించవచ్చని ఒక ఫిట్నెస్ ట్రైనర్ అంటున్నారు.
వెనిలా వాసన స్వీట్ తినాలనే కోరికను ఆపుతుందని ఒక అధ్యయనంలో తేలిందట. అందుకే వెనిలా ఐస్ క్రీమ్ వాసన చూడాలని అనుకోవడం కంటే వెనిలా ఫ్లేవర్ కలిగిన రూమ్ ఫ్రెషనర్ వాడుకోండి అని నిపుణులు సలహా ఇస్తున్నారు.
 
తినేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారో ఒకసారి గమనించండి. కంచం మీద కుర్చునప్పుడే మీకు కడుపునిండిందాక తినకండి. ఎందుకంటే మీరు తిన్నది సరిపోయిందనే సంకేతం మెదడు మీకు అందించేందుకు మెదడుకు 20 నిమిషాల సమయం పడుతుంది. మీరు ఫుల్‌గా తింటే ఎక్కువ తింటారు. పొట్టలో ఎప్పుడు 20 శాతం ఖాళీ ఉంచుకోవాలి. అప్పుడు తినాలనిపించినా.. మీరు తినకుండా లేస్తే ఆ తర్వాత సెట్‌ అయిపోతుంది. అయితే నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు స్పందించేందకు కావాలినంత సమయం వస్తుంది. నమిలి నెమ్మదిగా తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమై పోషకాలను గ్రహించేందుక దోహదం చేస్తుంది కూడా.
తినేందుకు స్పూన్ ఎడమ చేతితో పట్టుకోవడం వంటి చిన్న చిన్న చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి. మీకు బాగా అలవాటున్న చేతితో స్పూన్ లేదా ఫోర్క్ ను ఉపయోగించకుండా అలవాటు లేని చేతిని వాడడం వల్ల మెదడు చురుకుగా పనిచెయ్యదు. ఎక్కువ కలుపుతూ సమయం గడుపుతారు. ఫలితంగా ఎంత తింటున్నామనే దాని మీద దృష్టి నిలిచి ఉంటుందనే చిట్కాను మరో నిపుణుడు చెబుతున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.