రక్తంలో A1C స్థాయి ఎక్కువగా ఉంటే ప్రమాదమా..?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. రక్తం శుద్ధిగా ఉండాలి. రక్తం ద్వారానే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే A1C స్థాయిని తగ్గించి రక్తంలో షుగర్ లెవల్‌ను సమతుల్యం చేయాలి. బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా A1C స్థాయిని తగ్గించవచ్చు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడాన్ని నియంత్రించడం

రక్తంలో A1C స్థాయి ఎక్కువగా ఉంటే ప్రమాదమా..?


 

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. రక్తం శుద్ధిగా ఉండాలి. రక్తం ద్వారానే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే A1C స్థాయిని తగ్గించి రక్తంలో షుగర్ లెవల్‌ను సమతుల్యం చేయాలి. బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా A1C స్థాయిని తగ్గించవచ్చు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడాన్ని నియంత్రించడం, ఇన్సులిన్ తీసుకోవడం లేదా మెట్ఫార్మిన్ వంటి మందులను వాడటం ఎంతో కీలకం. A1C లెవల్ ద్వారా మీ రక్తంలో చక్కెరను సుమారు 12 వారాల వ్యవధిలో కొలువవచ్చు. అందువల్ల టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు A1C టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారెవరైనా వారి A1C స్థాయిలను ప్రతి 3 నెలలకోసారి టెస్ట్ చేసుకోవాలి. ఈ పరీక్ష ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను ముందుగానే గుర్తించి తద్వారా గుండె జబ్బులు లేదా మూత్రపిండాల వ్యాధి, షుగర్ వంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.  
 
Why do we have different blood types? | Live Science
A1C అంటే ఏమిటి?: 
A1C మీ రక్తంలోని గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ పరిమాణాన్ని సూచిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్‌తో జతచేసిన గ్లూకోజ్ మొత్తాన్ని సూచిస్తుంది. ఎర్ర రక్త కణం సాధారణ జీవిత కాలం 90 రోజులు కాగా రక్తంలో షుగర్ లెవల్ ఎక్కువగా ఉన్నవారిలో గ్లూకోజ్ వేగంగా కలుస్తుంది. ఒకవేళ డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో చక్కెరలను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటే వారు ప్రతి 3 నెలలకోసారి A1C పరీక్ష చేయించుకోవాలి.

 రక్తంలో A1C స్థాయిలు - 

సాధారణం 5.6% లేదా అంతకంటే తక్కువ 
ప్రిడియాబయాటిస్: 5.7% నుండి 6.4%
డయాబెటిస్: 6.5% లేదా అంతకంటే ఎక్కువ 
మీకు డయాబెటిస్ లేదా ప్రిడియాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, డాక్టర్ ఇచ్చిన సలహాలు పాటించండి. డయాబెటిస్ ఉన్న చాలా మందికి A1C స్థాయి 7% కన్నా తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు డాక్టర్ల సలహాలు తీసుకోండి. మీకు డయాబెటిస్ లేదా ప్రిడియాబయాటిస్ ఉంటే, మీ A1C ని లెవల్ తగ్గించడం చాలా ముఖ్యం. మీ రక్తంలో A1C ను సగానికి పైగా తగ్గించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
 

 A1C స్థాయిని ఎలా తగ్గించాలి

మీరు మీ సగటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించినప్పుడు మీ A1C స్థాయిలు కూడా తగ్గుతుంది. జీవనశైలి మార్పులు, మందుల ద్వారా A1C స్థాయిని తగ్గించుకోవచ్చు. "సరైన పోషకాహారం, వ్యాయామ నియమాన్ని అమలు చేయడం , డయాబెటిక్ మందులతో సహా మల్టీడిసిప్లినరీ విధానంతో చాలా మంది రోగులు A1Cని తగ్గించవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.