హార్ట్‌ అటాక్‌ కు ప్రధాన కారణాలివే.. వీటికి దూరంగా ఉంటే గుండె పదిలం!

ప్రస్తుత కాలంలో మనుషులను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు ప్రథమం.   ఈ రోజుల్లో జీవనశైలిలో భాగంగా మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లు వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే గుండెపోటు ప్రాణాంతకమైనప్పటికీ దాని నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.  అయితే అంతకంటే ముందు గుండెపోటుకు గల కారణాలేమిటి, e గుండెపోటు

హార్ట్‌ అటాక్‌ కు ప్రధాన కారణాలివే.. వీటికి దూరంగా ఉంటే గుండె పదిలం!


ప్రస్తుత కాలంలో మనుషులను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు ప్రథమం.   ఈ రోజుల్లో జీవనశైలిలో భాగంగా మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లు వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే గుండెపోటు ప్రాణాంతకమైనప్పటికీ దాని నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.  అయితే అంతకంటే ముందు గుండెపోటుకు గల కారణాలేమిటి, గుండెపోటు నుంచి ఎలా తపించుకోవాలి తెలుసుకుందాం...  
Silent heart attacks all too common, and often overlooked | American Heart  Association

గుండెపోటుకు కారణాలు ఏంటంటే.. 

తప్పనిసరిగా మార్చుకోవాల్సిన జీవనశైలి.. 

సరైన వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం వంటి జీవనశైలి అలవాట్ల కారణంగా  గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రోజులో ఏదో ఒక సమయంలో కచ్చితంగా వ్యాయామానికి కాస్త సమయం కేటాయించాలి. అందుకే  ప్రతిరోజు భోజనం తర్వాత కనీసం 10 నిముషాలు లేదా 400 మీటర్లు  నడవడం మంచిదని నిపుణులు అంటున్నారు.

సరైన ఆహారపు అలవాట్లు..

మనం రోజు తీసుకునే ఆహారమే ఆరోగ్యం పైన ప్రధానంగా ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అందుకే తీసుకునే ఆహారంలో  ఉప్పు, కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా అది గుండె పోటుకు దారితీస్తుంది. కాబట్టి ఆహారం విషయంలో  జాగ్రత్త పాటించడం మంచిది. 

మద్యపానం.. ధూమపానం.. 

పరిమితమైన మోతాదులో మద్యం తాగితే ఆరోగ్యానికే ప్రయోజనం.కానీ మితిమీరితే ప్రాణాలకే ప్రమాద.   అధిక మోతాదులో మద్యం తాగడం గుండెపోటుకు ఓ కారణం. కాబట్టి అలవాటు ను తగ్గించాలి. పొగ తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే సిగరెట్లు, పొగాకు నుంచి వచ్చే పొగ రక్తనాళాల్లో ఫలకం ఏర్పడేలా చేసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి పొగ తాగకపోవడమే మీ గుండెకు, ఆరోగ్యానికి మంచిది.

అధిక రక్తపోటు.. 

గుండెకు సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులకు అధిక రక్తపోటు కూడా ప్రధాన కారణం.  రక్త నాళాల్లో ప్రవహించే రక్తం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు గుండె పోటు వస్తుంది. అలానే  కిడ్నీలు,  బ్రెయిన్, కాలేయం వంటి ఇతర అవయవాల పనితీరు, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.