Walking : వాకింగ్ తో లాభాలెన్నో.. !

Walking వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని కేవలం వైస్ కాయపడిన వారు మాత్రమే కాకుండా ఏ వయసు వారైనా నిత్యం వాకింగ్ చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తుంది అవి ఏంటంటే..

Walking : వాకింగ్ తో లాభాలెన్నో.. !
Many benefits with walking


నిత్య జీవితాల వ్యాయామని భాగం చేసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే దీన్ని ఎవరికి వీలైన దాన్ని బట్టి వారు చేస్తూ ఉంటారు కొందరు జిమ్ కి వెళ్తుంటే మరి కొందరు రన్నింగ్ జాగింగ్ వంటివి చేస్తూ ఉంటారు కొంచెం వయసు పైబడిన వారు మాత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు ఇలా ఏ రకమైన శారీరక శ్రమ కలిగించిన శరీరం ఎంత ఉత్సాహంగా ఉంటుందని ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని తెలుస్తోంది..

వ్యాయామంతో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వయసు పడుతున్న వాళ్ళు కేవలం వాకింగ్ మాత్రమే వారి దినచర్యలో భాగం చేసుకుంటూ ఉంటారు అయితే ఈ వాకింగ్ వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని కేవలం వైస్ కాయపడిన వారు మాత్రమే కాకుండా ఏ వయసు వారైనా నిత్యం వాకింగ్ చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తుంది అవి ఏంటంటే..

రోజంతా ఉత్సాహంగా ఉంటుంది..

రోజులో కాసేపైనా నడకను అలవాటుగా మార్చుకోవడం వల్ల రోజంతా ఎంత ఉత్సాహంగా మారుతుందని తెలుస్తుంది ఉదయాన్నే సూర్యోదయం సమయంలో కాసేపు బయట నడవడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది..

శరీర బరువుని సమతుల్యంగా ఉంచుతుంది..

నిత్యం నడక వలన శరీర బరువు అదుపులో ఉంటుందని తెలుస్తోంది శరీరంలో ఉండే అధిక కొవ్వు రోజు వ్యాయామంతో కరిగిపోతుంది దీనివలన ఎంతో చురుగ్గా అనిపించడమే కాకుండా అదనపు కొవ్వు సైతం శరీరంలో చేరదు..

ఒత్తిడికి దూరం..

ఎలాంటి ఒత్తిడి ఉన్న  శరీరానికి శ్రమ కలిగించడం చాలా ముఖ్యం.. బాధలు ఉన్నాయి కదా అని నిద్రలేవకుండా మంచం మీద పడుకొని ఉంటే మరింత చిరాకుగా అనిపిస్తుంది అలా కాదని కొంచెం ఓపిక తెచ్చుకుని తెల్లవారే లేచి కాసేపు అందరితో కలిసి బయట నడవడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఒత్తిడి దూరం అవుతుంది..

రక్తపోటు అదుపులో..

ముఖ్యంగా కొంత వయసు రాగానే రక్తపోటు సమస్య వేధిస్తూ ఉంటుంది అయితే నిత్యం న్యాయమంతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది అంతే కాకుండా గుండె పనితీరు సైతం మెరుగుపడుతుందని అంటున్నారు వైద్య నిపుణులు..

ఎముకలు దృఢంగా మారుతాయి..

కొంత వయసు మీద పడగానే ఎముకలకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కీళ్లవాతం కీళ్ల నొప్పులు మోకాల చెప్పడానికి పోవటం అంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఇలాంటివారు నడకను నిత్యం చేయడం వల్ల ఎముకలు గట్టి పడతాయని ఈ సమస్యలన్నిటి నుంచి దూరం కావచ్చని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.