Nagkesar flower : ఈ పువ్వును చూసే ఉంటారుగా..? లాభాలు తెలిస్తే ఇక వదలరు..!!
Nagkesar flower : ఈ పువ్వును చూసే ఉంటారుగా..? లాభాలు తెలిస్తే ఇక వదలరు..!!
Nagkesar flower... వీటిల్లో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. అవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. నాగకేసర పవ్వులతో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో చూద్దాం...
Nagkesar flower : ప్రకృతి కేవలం అందానికి మాత్రమే కాదు.. ఎన్నో రోగాలకు పరిష్కారాలను కూడా తన ఒడిలో దాచుకుంది. ఆయుర్వేదానికి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలను నయం చేయగల శక్తి ఉంది. ఆకులు, కొమ్మలు, పండ్ల తొక్కలు, పూలు ఇలా ప్రతీ దానిలో ఎంతోకొంత ఔషధం ఉంది.. అవి ఏ సమస్యలకు పనిచేస్తాయి అని తెలుసుకుంటే చాలు..
మీరు చాలా రకాల పూల గురించి విని ఉంటారు..పూలు కేవలం అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచివే. చామంతితో టీ చేసుకుంటారు తెలుసా..? ఇక అసలు విషయానికి వస్తే.. నాగకేసర పువ్వులు.. వీటిల్లో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. అవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. నాగకేసర పవ్వులతో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో చూద్దాం...
నాగకేసర పువ్వు వల్ల ఉపయోగాలు..
నాగకేసర నూనెను గాయాలు, పుండ్లపై రాస్తుంటే అవి త్వరగా మానిపోతాయి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నాగకేసర పువ్వుల పొడిని కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది.
నాగకేసర పువ్వుల పొడితో వెక్కిళ్లను కూడా తగ్గించుకోవచ్చు. ఈ పువ్వుల పొడిని తేనెతో తీసుకోవాలి. అదే పొడిని చెరుకు రసంతో కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో వెక్కిళ్లు వెంటనే తగ్గిపోతాయి.
నాగకేసర పువ్వుతో (Nagakesra flower) జలుబును తగ్గించుకోవచ్చు. అందుకుకోసం.. ఈ పువ్వును తీసుకుని బాగా నలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని నుదుటిపై రాయాలి. దీంతో జలుబు తగ్గుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నాగకేసర పువ్వుల పొడి, తేనెలను కలిపి తీసుకోవాలి. దీంతో అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
నాగకేసర పువ్వులతో తయారు చేసే నూనె మనకు మార్కెట్లో లభిస్తుంది. దాన్ని కీళ్లపై మర్దనా చేసినట్లు రాస్తుండాలి. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
నాగకేసర పువ్వుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది. పావు టీస్పూన్ తేనెను అర టీస్పూన్ పొడితో కలిపి తీసుకోవాలి. దీన్ని రోజుకు 2 సార్లు తీసుకుంటే చాలు.
నాగకేసర పువ్వుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే పైల్స్, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయి. ఆ మిశ్రమాన్ని రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోవాలి.
గమనిక :
ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణులను సంప్రదించండి.