ఆయుర్వేదం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు కాళ్ళు కడుక్కోవడం వల్ల ఎన్ని లాభాలో

బయట నుంచి ఇంటికి రాగనే కాళ్ళు కడుక్కోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. బయట ఉన్న ధుమ్మూ ధూళి ఇంట్లోకి రాకుండా ముందే కాళ్ళను క్లీన్‌ చేసుకుంటారు. కానీ రాత్రి నిద్రపోయే ముందు కాళ్లను క్లీన్‌ చేసుకునే..

ఆయుర్వేదం ప్రకారం రాత్రి నిద్రపోయే ముందు కాళ్ళు కడుక్కోవడం వల్ల ఎన్ని లాభాలో


బయట నుంచి ఇంటికి రాగనే కాళ్ళు  కడుక్కోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. బయట ఉన్న ధుమ్మూ ధూళి ఇంట్లోకి రాకుండా ముందే కాళ్ళను క్లీన్‌ చేసుకుంటారు. కానీ రాత్రి నిద్రపోయే ముందు కాళ్లను క్లీన్‌ చేసుకునే అలవాటు మాత్రం ఎవరికీ ఉండదేమో. కానీ నిద్రకు ముందు కాళ్లు కడుక్కోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దామా..!

కాళ్ళు మాత్రమే మన శరీరంలో మొత్తం బరువును మోయగల ఏకైక భాగం. దీని వల్ల కాళ్లలో తరచుగా దృఢత్వం, తిమ్మిర్లు, నొప్పి వస్తుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే, మీరు పడుకునే ముందు మీ పాదాలను కడక్కోని నిద్రపోండి. ఇలా చేయడం వల్ల మీ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకు చాలా ఉపశమనం కలుగుతుంది.
 
పాదాలు ఎక్కువగా చెమట పట్టేవారిని హైపర్ హైడ్రోసిస్ అంటారు. అలాంటి వాళ్లు రాత్రి పాదాలు కడుక్కుని నిద్రపోవాలి. దీనివల్ల పాదాలలో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. అథ్లెట్స్ ఫుట్ ను నివారిస్తుంది.  

శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవాళ్లు కాళ్లు కడుక్కుని పడుకోవాలి. రాత్రి పడుకునే ముందు పాదాలను కడుక్కోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. 

రోజు వారీగా పరుగెత్తే బిజీ లైఫ్ స్టైల్ వల్ల కాళ్ల కండరాలు, ఎముకల్లో నొప్పి వస్తుంది. పాదాల్లో నొప్పి ఎక్కువగా ఉంటే పాదాలు కడుక్కుని పడుకోవాలి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి శరీరం రిలాక్స్‌గా ఉంటుంది.ఆయుర్వేదం ప్రకారం.. రాత్రి పడుకునే ముందు పాదాలను కడుక్కోవడం మంచిది. ఇది మంచి నిద్రకు దారి తీస్తుంది, ఒత్తిడి కూడా తగ్గతుందట.


చల్లని, సాధారణ లేదా గోరువెచ్చని నీటితో మీ పాదాలను కడగవచ్చు. బకెట్‌లో నీళ్లు తీసుకుని అందులో కొన్ని నిమ్మకాయ ముక్కలను వేయాలి. ఇప్పుడు అందులో పాదాలను కాసేపు ఉంచండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత పాదాలను బయటకు తీసి బాగా ఆరబెట్టి నూనె రాయాలి. ఇది మీకు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఇంత టైమ్‌ లేదంటే ఇక బెడ్‌ ఎక్కుతాం అన్నప్పుడు కాళ్లను క్లీన్‌ చేసుకుని పడుకోండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.