తమలపాకు ఔషధగుణాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

శుభకార్యాల్లో తమలపాకులు చాలా ముఖ్యం. వాయనాలు ఇచ్చేప్పుడు కచ్చితంగా వాడతారు. తమలపాకు శుభప్రదమైనదే కాదు, ఆరోగ్యవంతమైనది కూడా.! ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. త‌మ‌ల‌పాకులో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకు ఔషధగుణాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!


శుభకార్యాల్లో తమలపాకులు చాలా ముఖ్యం. వాయనాలు ఇచ్చేప్పుడు కచ్చితంగా వాడతారు. తమలపాకు శుభప్రదమైనదే కాదు, ఆరోగ్యవంతమైనది కూడా.! ఇందులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. త‌మ‌ల‌పాకులో ఉండే ఔష‌ధ గుణాల గురించి అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Reap these 7 health benefits of paan or betel leaves in summers | Reap News  – India TV
త‌మ‌ల‌పాకులో యాంటీ వైర‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ లక్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఇన్ఫెక్ష‌న్‌ల బారిన ప‌డ‌కుండా ఉండొచ్చు. 
శ‌రీరంలో నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో కూడా త‌మ‌లపాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. 
అజీర్తి, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌మ‌ల‌పాకును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. 
అలాగే ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించే గుణం కూడా ఈ త‌మ‌ల‌పాకుకు ఉంది. 
త‌మ‌ల‌పాకును న‌మిలి తిన‌డం వ‌ల్ల నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. 
త‌మ‌ల‌పాకులో ఒక వెల్లుల్లి రెబ్బ‌ను, ఒక చిన్న అల్లం ముక్క‌ను ఉంచి తేనెతో క‌లిపి ప‌ర‌గ‌డుపున‌ మెత్త‌గా న‌మిలి తిన‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు తొల‌గిపోతాయి. ఇలా 21 రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల అడ్డంకులు తొల‌గిపోయి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. 
త‌మ‌ల‌పాకుతో హ‌ల్వా, ల‌డ్డూ వంటి తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. త‌మ‌ల‌పాకును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. 
గొంతు నొప్పి, గొంతులో గ‌ర‌గ‌ర వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌మ‌లపాకును న‌మిలి దాన్ని ర‌సాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ ఉంటే గొంతు నొప్పి త‌గ్గుతుంది. అలాగే త‌మ‌ల‌పాకుకు ఆముదం రాసి వేడి చేయాలి.
చిన్న పిల్ల‌ల క‌డుపుపై ఉంచ‌డం వ‌ల్ల గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి క‌డుపు నొప్పి తగ్గుతుంది. 
ఈ ఆకుకు ప‌సుపు రాసి పిల్ల‌ల‌కు త‌ల‌పై ఉంచ‌డం వ‌ల్ల జలుబు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. 
ల‌వంగాల‌ను, జాజికాయ‌ను, యాల‌కుల‌ను, గులాబి రేకుల‌ను, ఎండు కొబ్బ‌రిని త‌గిన మోతాదులో తీసుకుని తేనెతో క‌లిపి పాకం ప‌ట్టి హ‌ల్వా లాగా త‌యారు చేసుకోవాలి. ఈ హ‌ల్వాను త‌మ‌ల‌పాకుతో క‌లిపి తీసుకుంటే నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. 
లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు తమలపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
తమలపాకులు ఖరీదైనవి ఏం కాదు. వీటిని వాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ట్రై చేయండి. ఇలా తినలేం అనుకునేవాళ్లు వీటితో వంటలు చేసుకుని లాగించేయొచ్చు.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.