ఇవి తింటే శృంగారంపై ఆసక్తి పెరుగుతుందట..

సమస్యలు లేనివి ఎవరికి. అందరికీ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. పురుషులకు ఒక సమస్య. మహిళలకు మరో సమస్య. నిత్యం ఒక్కో ప్రాబ్లమ్‌తో సతమతమవుతుంటారు.

ఇవి తింటే శృంగారంపై ఆసక్తి పెరుగుతుందట..


సమస్యలు లేనివి ఎవరికి. అందరికీ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. పురుషులకు ఒక సమస్య. మహిళలకు మరో సమస్య. నిత్యం ఒక్కో ప్రాబ్లమ్‌తో సతమతమవుతుంటారు.

ఈ మధ్య సంతాన సమస్యలు మహిళలతో పాటు పురుషులు కూడా ఎదుర్కుంటున్నారు. అయితే ఈ విషయంలో పురుషులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పురుషులకు ఈ మధ్య మధుమేహం, గుండెజబ్బులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. సంతాన లేమి ఎదుర్కొంటున్న 50   ఏళ్ల లోపు వారిలో మూడింటి ఒక వంతు మందిలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల స్థాయులు 7 రెట్లు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. అయితే ఈ హార్మోన్‌ తక్కువగా ఉండేవారిలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దానివల్ల ఎముక క్షీణించి....తేలికగా విరిగిపోతాయి.

సంతాన సమస్యల కోసం చికిత్సలు తీసుకునేవారు కచ్చితంగా ఒకసారి సెక్స్‌ హార్మోన్ల పరీక్షలు చేయించుకోవాలి. గుండెజబ్బులు, డయాబెటిస్‌, దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవారు కచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాలి. వీళ్లకు సంతాన సమస్యలు కూడా అవకాశాలు ఉండనే ఉంటాయి.

ప్రపంచంలో మీ ఒక్కరికే ఈ సమస్య వచ్చిందనుకుని మదన పడిపోవద్దు. ఎవరైనా సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతారునుకుని ఒంటరిగా కూర్చుని దిగులుపడొద్దు. మీలో మీరు బాధపడొద్దు. ప్రపంచంలో చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ఇన్‌ఫెర్టిలిటీ ఒకటి.

సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే హార్మోన్లు.. బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి గింజల్లో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. d విటమిన్  గుడ్లు, స్ట్రాబెర్రీ గింజలు అధికంగా తీసుకుంటే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి స్తంభన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, తాజా ఆకుకూరలు ప్రతి రోజూ తీసుకోవాలి. ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్‌ చాలా మంచిది. పాలకూర, పెప్పర్, గ్రీన్ టీ కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.

శృంగారంపై ఆసక్తి పెరగటానికి పురుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకూ రకకాల పదార్థాలు తింటుంటారు. అయితే అవి ఎంతవరకు పనిచేస్తాయన్నది మాత్రం తెలియదు. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.