ఇలా  చేస్తే సంతాన సమస్యలకు  చెక్‌ పెట్టొచ్చు...

మాతృత్వం అనేది ఒక అనుభూతి. అమ్మ అనే పిలుపు కోసం పరితపించని స్త్రీ...ఈ సృష్టిలోనే లేదు. అంతటి గొప్ప వరం...సంతానాన్ని కనడం. దానికోసం మొక్కని దేవుడు లేడు. చేయని పూజ లేదు. తినని మందు లేదు. ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు.  

ఇలా  చేస్తే సంతాన సమస్యలకు  చెక్‌ పెట్టొచ్చు...


మాతృత్వం అనేది ఒక అనుభూతి. అమ్మ అనే పిలుపు కోసం పరితపించని స్త్రీ...ఈ సృష్టిలోనే లేదు. అంతటి గొప్ప వరం...సంతానాన్ని కనడం. దానికోసం మొక్కని దేవుడు లేడు. చేయని పూజ లేదు. తినని మందు లేదు. ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు.  

Headaches During Pregnancy: Causes and Finding Relief

కానీ సంతానలేమి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. దాని గురించి తెలుసుకుంటేనే ఎలా బయటపడాలనేది తెలుస్తుంది. ప్రస్తుతం మన అనారోగ్యకరమైన ఆహార నియమావళి ఎన్నో సమస్యలను తీసుకొస్తోంది. గర్భాశయంలో మార్పులు, ప్రాబ్లమ్స్‌ కారణంగా....చాలా మంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఇంకొంత మంది సంతానం కోసం ఫెర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇంకా అద్దె గర్భం కామన్‌ అయిపోయింది.

అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరోగ్యకమైన విధానం లేకపోతే....వృథా ప్రయాసే. కాబట్టి మంచి జీవనశైలి ఉండాలి. అందుకోసం మంచి పోషకాలతో ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నేటి ఆధునిక రోజుల్లో మహిళలకు ఎన్నో సవాళ్లు. పీసీఓడీ, థైరాయిడ్, నెలసరి రుగ్మతలు....వీటన్నింటిని ఎదుర్కోవల్సిందే. కాబట్టి గర్భం ధరించాలనుకునే మహిళలకు ఇవన్నీ సమస్యలే. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకుంటే... పిల్లలు పుట్టే అవకాశముంటుంది.



గర్భం కోసం అండం ఎంత ముఖ్యమో..దాని నాణ్యత కూడా అంతే ప్రాధాన్యం. కాబట్టి
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందుకోసం కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు బాగా తినాలి. కొందరు అల్పాహారం తక్కువగా తీసుకుంటారు. కానీ తక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నీరసం అయిపోతుంది. అందువల్ల ఉదయం తినే టిఫిన్‌ ఎక్కువ మోతాదులో తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యతను బ్యాలెన్స్‌ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పీసీఓడీని అదుపులో పెట్టవచ్చు. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు అల్పాహారంలో ఎక్కువ క్యాలరీలుండే ఆహారం తింటే.... ఇన్సులిన్, టెస్టోస్టిరాన్‌ స్థాయులు తగ్గుతాయి.

ఇవి తగ్గితేనే సంతానలేని సమస్య తగ్గుతుంది కూడానూ, ఇవి ఎక్కువగా ఉంటే....సంతానలేమి ఏర్పడుతుంది. చెడు కొవ్వులు.....రక్తంలో ఇన్సులిన్‌  పెంచి అండోత్పత్తి, గర్భధారణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకని చెడుకొవ్వులు ఎక్కువగా ఉండే....బేకరీ పదార్థాలు, ప్రాసెస్ ఫుడ్‌ వంటి వాటిని దూరంగా ఉండాలి.

మొదట ప్రతి మహిళ తెలుసుకోవల్సిన విషయమేమిటంటే...ఎందుకు సంతానలేమి సమస్య వచ్చిందో ముందే గుర్తించాలి. అప్పుడప్పుడు గర్భానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. థైరాయిడ్‌ టెస్టులు చేయించుకోవాలి. కాబట్టి తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. లేట్‌ నైట్‌ ఫుడ్‌ మానుకోవాలి. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.