వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!

ఏటా కంటే.. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి.. ఒక పక్కన వర్షాలు పడుతున్నా.. సాయంత్రానికి సీన్‌ మారిపోతుంది. వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.. పెరిగిపోవడమే కాదు.. కొన్ని ఏరియాల్లో వడదెబ్బ వల్ల చనిపోతున్నారు

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!


ఏటా కంటే.. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి.. ఒక పక్కన వర్షాలు పడుతున్నా.. సాయంత్రానికి సీన్‌ మారిపోతుంది. వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.. పెరిగిపోవడమే కాదు.. కొన్ని ఏరియాల్లో వడదెబ్బ వల్ల చనిపోతున్నారు. ఆరోగ్య నిపుణులు ఈ వేసవిలో ఎండ దెబ్బను నివారించడానికి ముఖ్యమైన చిట్కాలతో పాటూ, రోగి ఆసుపత్రిలో చేర్చేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రోజు మొత్తం ఎండలోనే ఎక్కువసేపు పని చేయాల్సిన ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఆటగాళ్లు, కార్మికులు, బయట విధులు నిర్వహించే పోలీసులకు ఈ ప్రమాదం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. వీళ్లు తప్పకుండా ఎండబారి నుంచి రక్షించుకోడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.

Sunburn Dos And Don'ts: Tips From Your Dermatologist | Southlake, TX -  Compassion Dermatology Southlake, Southlake & Grapevine TX Area

అధిక ఉష్ణోగ్రతలో పనిచేస్తున్నపుడు చెమట బయటకు పంపి మన శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. చెమట ఆవిరైనప్పుడు కాస్త చల్లగా అనిపిస్తుంది. కానీ శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్లలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువుంటుంది. దాని వల్ల ఎక్కువ చెమట వస్తుంది. ఎక్కువ సమయం ఇలాగే ఉండే డీ హైడ్రేషన్ సమస్య వచ్చి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

నీళ్లు ఎక్కువగా తాగాలి. బయట పనిచేసేవాళ్లు జ్యూసులు, కొబ్బరినీళ్లు, చల్లటి నీళ్లు తరచూ తీసుకుంటుండాలి.

ముదురు రంగు బట్టలు వేడిని గ్రహిస్తాయి. అందుకే లేత రంగులో, వదులుగా ఉండే బట్టలు వేసుకోండి.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకండి.

ఆల్కహాల్ తాగడం మానేయాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండదు. స్మోకింగ్‌ కూడా.. అసలే ఎండ.. మీదికెళ్లి మీరు సిగిరెట్‌, బీడీ తాగితే.. అసలు ఇంకేమైనా ఉందా..? మీకు అంతగా తాగాలని ఉంటే.. సాయంత్రంచల్లబడ్డాక తాగండి.. మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకూ వాటి జోలికి పోకండి.!

మధ్యాహ్న సమయంలో వ్యాయామాలు చేయకూడదు. ఉదయం, సాయంకాలంలోనే శారీరక కసరత్తులు చేయాలి.

వడదెబ్బ తగిలిన వ్యక్తిని ఎలా చూసుకోవాలి?

ముందుగా చల్లని నీడ ఉన్న ప్రదేశంలోకి వాళ్లని తీసుకెళ్లి పడుకోబెట్టండి.
తడి గుడ్డతో ఒళ్లు తుడవండి దాని వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. 
శరీరం మొత్తం గాలి తగిలేలా చూడండి.
వీలుంటే స్విమ్మింగ్ పూల్ లేదా బాత్ టబ్ లో తల తప్ప శరీరం మొత్తం మునిగేలా పడుకోబెట్టండి.
గోరు వెచ్చని నీళ్లని తల మీద పోయాలి.
ఉప్పు కలిపిన నీళ్లు ఇవ్వాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.