White tea : వైట్‌ టీ గురించి తెలుసా.. ? గ్రీన్‌ టీ కంటే బెస్ట్..!! ఎలా త‌యారు చేయాలంటే..?

మీరు white tea  గురించి విన్నారా..? దీన్నే Camellia tea అని పిలుస్తారు. ఇది మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తుంది. Camellia synesis అనే మూలిక నుంచి ఈ టీని త‌యారు చేస్తారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ ఉంటాయి.

White tea : వైట్‌ టీ గురించి తెలుసా.. ? గ్రీన్‌ టీ కంటే బెస్ట్..!! ఎలా త‌యారు చేయాలంటే..?
Benefits of White tea


Benefits of white tea : ఈరోజుల్లో రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి... గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, హెర్బల్‌ టీ ఇలా.. ఇవి అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.. weight loss కు చాలామంది వీటిని తాగుతుంటారు. అయితే మీరు white tea  గురించి విన్నారా..? దీన్నే క‌మెల్లియా టీ అని పిలుస్తారు. ఇది మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తుంది. దీంతో అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.
క‌మెల్లియా సైనెసిస్ అనే మూలిక నుంచి ఈ టీని త‌యారు చేస్తారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.
వైట్ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం ఉండదు.. ఈ టీలో కెఫీన్, ఏజీసీజీ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తాగితే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.
వైట్ టీలో ఫ్లోరైడ్స్ అధికంగా ఉంటాయి. అవి సూక్ష్మ క్రిముల‌ను చంపుతాయి. దంతాలు, చిగుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో బాక్టీరియా న‌శిస్తుంది.
క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని త‌గ్గించే గుణాలు వైట్ టీలో ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అందువ‌ల్ల వైట్ టీని రోజూ తాగుతుంటే క్యాన్స‌ర్ ప్రమాదం ఉండదు.

వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్ శ‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తిని పెంచుతాయి. దీంతో బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
ఆస్టియోపోరోసిస్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఓ ఎముక‌ల వ్యాధి. దీని వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారి విరిగిపోతుంటాయి. అయితే వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్, కాటెకిన్స్ ఆస్టియోపోరోసిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తాయి.
వైట్ టీని తాగుతుండడం వ‌ల్ల చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. సూర్యుని నుంచి వ‌చ్చే అతి నీల‌లోహిత (యూవీ) కిర‌ణాల నుంచి చ‌ర్మం సంర‌క్షింప‌బ‌డుతుంది. దీంతోపాటు వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా రావు. చ‌ర్మం మీద ముడ‌త‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

మరి ఈ వైట్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం… 

200ml నీటిని 5 నిమిషాలు ఉడికించాలి. బుడగలు వస్తున్నప్పుడు నీటిని కప్పులో పొయ్యాలి. అందులో వైట్ టీ బ్యాగ్ వెయ్యాలి. రెండు నిమిషాల్లో అందులోని సారం నీటిలో చేరుతుంది. దీనికి తీపిదనం కోసం చక్కెర లేదా తేనె కలుపుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు తేనె కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది.
వైట్ టీలో కాటెచిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. అవి మన శరీరంలోని విష వ్యర్థాలతో పోరాడుతాయి. ఈ టీ తాగేవారిలో ముసలితనపు లక్షణాలు త్వరగా రావట్లేదు. ముడుతలు కూడా త్వరగా రావట్లేదు. జుట్టును కాపాడటంలో ఈ టీ బాగా ఉపయోగపడుతోంది. సూర్యుడి వేడి నుంచీ చర్మాన్ని, కణాలనూ రక్షించడంలో ఈ టీ చక్కగా పనిచేస్తోంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.