వేసవిలో ఎక్కువగా వేధించే చర్మ సమస్య సోరియాసిస్.. ఈ జాగ్రత్తలతో అదుపు చేయడం మీ చేతిలోనే!

సోరియాసిస్ అనేది దీర్ఘకాలం వేధించే ఒక ఆటో ఇమ్యునో డిసీజ్. సాధారణంగా చర్మ సమస్యగా కనిపించినప్పటికీ ఇది శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ పై ప్రతికూలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.

వేసవిలో ఎక్కువగా వేధించే చర్మ సమస్య సోరియాసిస్.. ఈ జాగ్రత్తలతో అదుపు చేయడం మీ చేతిలోనే!


సోరియాసిస్ అనేది దీర్ఘకాలం వేధించే ఒక ఆటో ఇమ్యునో డిసీజ్. సాధారణంగా చర్మ సమస్యగా కనిపించినప్పటికీ ఇది శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ పై ప్రతికూలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో ఎలా అదుపు చేయొచ్చు తెలుసుకుందాం.

Psoriasis and mental health: Know how this skin disease is linked to stress  | HealthShots

సోరియాసిస్ అంటే ఏంటంటే.. చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. వీరిలో దురద, చిరాకు ఎక్కువగా ఉంటుంది. నిజానికి సోరియాసిస్ అంటే ఒకటి మాత్రమే కాదు ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి లక్షణాలను బట్టి సీజన్ ను బట్టి ఈ వ్యాధి మారిపోతూ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలతో దీన్ని తేలిగ్గా అదుపు చేయొచ్చు.

వదులు దుస్తులు ధరించాలి..

సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన చెమట సమస్య వేధిస్తూ ఉంటుంది. ఎక్కువ సమయం పాటు శరీరంలో చెమట ఉండిపోతే శరీరంపై పలు రకాల సూక్ష్మజీవులు దాడి చేస్తాయి. ఇందులో భాగంగా సోరియాసిస్ వ్యాధి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండకపోతే ఈ వ్యాధి ఈ కాలంలో ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. సౌకర్యవంతగా ఉండే కాటన్‌ దుస్తులు వేసుకోవాలి. అలాగే వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. నేరుగా సూర్యకిరణాలు శరీరం మీద పడకుండా జాగ్రత్త పడాలి.

సూర్యరశ్మి పొందండి..

ఎండాకాలం వేడి తట్టుకోలేక చాలామంది ఇళ్లలోంచి బయటికి రారు. కానీ ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు. ఉదయం పూట కచ్చితంగా కొంత సమయం ఎండలో గడపాలి. సూర్య రష్మిలో ఉండే డి విటమిన్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. అలాగే సోరియాసిస్తో బాధపడేవారు కచ్చితంగా రోజు కొంతసేపు ఎండలో గడిపితే డి విటమిన్ ఈ సమస్యను అదుపులో ఉంచుతుందని తెలుస్తుంది.

మాయిశ్చరైజర్‌ అప్లై చేయడం..

సాధారణంగా చలికాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. కొంచెం ఆరోగ్య స్పృహ ఉన్నవారు వేసవికాలంలో సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారు. చాలామంది ఎండాకాలంలో శరీరానికి ఎలాంటి క్రీమ్లు రాయకుండా వదిలేస్తారు. కానీ ఇలా చేయడం తగిన పద్ధతి కాదు. శరీరానికి సరిపడే మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం వల్ల ఎండాకాలంలో చర్మం పాడవకుండా ఉంటుంది.

అలాగే కొందరిలో ఎక్కువగా చెమట పట్టే శరీరతత్వం ఉంటుంది. వారిలో సోరియాసిస్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎప్పటికప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉతికిన తేలికపాటి దుస్తులను మాత్రమే ధరిస్తూ ఎప్పటికప్పుడు బెడ్ షీట్స్ మార్చడం, దిండు కవర్లు మార్చడం చేయాలి. అలాగే కీటకాలు, దోమలు రాకుండా వాటి నుండి తగిన జాగ్రత్త తీసుకోవాలి. మరీ ఎండగా ఉంటే సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.