jackfruit seeds : పనస పండు తిని గింజలను పారేస్తున్నారుగా.. గింజల్లోనే ఎక్కువ పోషకాలు, అనేక ఔషధగుణాలున్నాయి!!
పనస పండు గింజల ( jackfruit seeds ) గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. పనసపండు తిని, గింజలన్నీ తీసి పారేస్తాం.. కానీ అలాంటి గింజల్లో పండ్ల కంటే బలం ఎక్కువగా ఉంటుంది. మంచి పోషకాలు ఉన్నాయి. అనేక ఔషధగుణాలు ఉన్నాయి.

jackfruit పనసపండు సీజనల్ గా మనకు లభిస్తుంది. చక్కగా పండిన తర్వతా తొనలు తినేసి గింజలు పారేస్తుంటాం. పనసపండు అంటే కూడా చాలామంది ఇష్టపడతారు. వాటితో జ్యూస్ చేసుకుని తాగుతాం.. పనసపొట్టు కూర కూడా చేస్తుంటారు..ఇలా మనకు పనసపండు గురించే తెలుసుకానీ..ఆ ( jackfruit seed) గింజల గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఎప్పుడు పనసపండు తిని, గింజలన్నీ తీసి పారేస్తాం.. కానీ అలాంటి గింజల్లో పండ్ల కంటే బలం ఎక్కువగా ఉంటుంది. మంచి పోషకాలు ఉన్నాయి. అనేక ఔషధగుణాలు ఉన్నాయి. మరి ఈ పనస గింజల్లో ఏ ఏ పోషకాలు ఉన్నాయో మీకు తెలియజేస్తే..ఈసారి నుంచి గింజలను పారేయకుంటా వాడుకుంటారని అందిస్తున్నాం.
ఒకప్పుడు పనస గింజల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు..కానీ ఇప్పుడు అక్కడక్కడ వీటిని అమ్మడం కూడా మొదలుపెట్టారు.. ఎందుకంటే..జనాల్లో వీటిమీద కాస్త అవగాహన పెరిగింది. పనస గింజల మీద సైంటిఫిక్ గా పరిశోధన చేసి కొన్ని విషయాలు చెప్పారు.
100 గ్రాముల పనస గింజలు తీసుకుంటే.. అందులో ఉండే పోషకాలు
- నీటి శాతం 60 గ్రాములు
- కార్ఫోహైడ్రేట్స్ 30-35 గ్రాములు
- మాంసకృతులు 7 గ్రాములు
- కొవ్వు 0.5 గ్రాములు
- శక్తి 200 కాలరీలు
- పీచులు 3 గ్రాములు
- పొటాషియం 246 మైక్రోగ్రాములు
- విటమిన్ C 11 మైక్రోగ్రాములు
- సోడియం 63 మిల్లీగ్రాములు
ఇవన్నీ పచ్చిపనస గింజల్లో ఉండే స్థూల, సూక్ష్మపోషకాలు
పనసగింజలు తింటే కలిగే లాభాలు.. సైంటిఫిక్ పరిశోధన ప్రకారం..
- ఈ గింజలపైన బ్రౌన్ కలర్ తొక్క ఉంటుంది కదా..అందులో ఉండే కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల మన ప్రేగుల్లో హాని కలిగించే సూక్ష్మజీవులు.. ముఖ్యంగా ఈకోలి లాంటి.. 40 రకాల పైబడి ఉంటాయి.. అలాంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నిర్మూలించే యాంటిబాక్టిరియల్ ప్రోపర్టీస్ ఈ పనస గింజపైన ఉంటాయని సైంటిఫిక్ గా నిరూపించారు.
- లూస్ మోషన్స్ అయ్యేటప్పుడు ఈ గింజల్లో ఉండే పిండిపదార్థాలు ఈ సమస్యను తగ్గిస్తున్నాయని కూడా ప్రూవ్ చేసారు.
- ఈ గింజల్లో ఫ్లైవనాయిడ్స్, సాపొనిన్స్, ఫినాల్స్ వీటి కాంపోజిషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ డామేజన్ ను మన కలజాలంలో జరగకుండా నిర్మూలించి కణజాలాన్ని రక్షిస్తుందట.
- క్యాన్సర్ లాంటి దీర్ఘరోగాలు భారిన పడకుండా కాపడటానికి, మనకణజాలం ఉండే డీఎన్ఏ డామేజ్ అవకుండా రక్షించుకోవడానికి ఈ కెమికల్ కాంపోజిషన్స్ బాగా ఉపయోగపడుతున్నాయని 2012వ సంవత్సరంలో డాక్టర్ బాలసాహెబ్ సవంత్ కృషి విద్యాపీఠ్- మహరాష్ట్ర( Dr. Balasaheb Sawant Konkan Krishi Vidyapeeth Dapoli- Maharashtra) వారు పరిశోధన చేసి ఇచ్చారు.
మనకు మార్కెట్లో అందుబాటులో పనస గింజలు లభించనప్పుడల్లా మనం వాటిని తెచ్చుకుని చక్కగా వొవెన్ లో హీట్ చేసుకోవచ్చు. లేదా నాన్ స్టిక్ మీద కూడా దోరగా వేయించుకోవచ్చు. ఇలా కాల్చుకుని..పైన తొక్క కొంచెం మాడేవరకూ ఉంచుకుని తీసేస్తే..ఆ గింజల్లో ఉండే పిండిపదార్థం అద్భుతంగా ఉంటుంది. అలా తినొచ్చు.
పనసగింజల బిర్యాని చేసుకోవచ్చు, కుర్మా చేసుకోవచ్చు, పనస గింజల మసాల కూర చేయొచ్చు, ఈ గింజలతో పలావు చేయొచ్చు. ఇలా ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు.
ఇలా ఆరోగ్యానికి, బలానికి అనేక లభాలు ఇవ్వడానికి ప్రకృతి ప్రసాదించిన మంచి గింజలు పనస గింజలు దొరికినప్పుడల్లా ఉపయోగించుకుంటే..మంచి ఫలితాలు ఉంటాయని ప్రముఖ ప్రకృతి వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక :ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.