Ghee, carrom seeds : అన్నం మొదటి ముద్దలో ఈ రెండు కలిపి పిల్లలకు తినిపించండి.. నెల రోజుల్లోనే తెలివితేటల్లో తేడా మీకే కనిపిస్తుంది..

Ghee, carrom seeds : తెలివితేటలు కేవలం సాధన, నేర్చుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటాయి. అయితే చాలామంది ఇవి కొందరిలో ఎక్కువగా ఉంటాయని మరికొందరిలో తక్కువగా ఉంటాయని భ్రమ పడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదని తెలుస్తోంది

Ghee,  carrom seeds : అన్నం మొదటి ముద్దలో ఈ రెండు కలిపి పిల్లలకు తినిపించండి.. నెల రోజుల్లోనే తెలివితేటల్లో తేడా మీకే కనిపిస్తుంది..
benefits of ghee, carrom seeds for children


Benefits of ghee, carrom seeds for children : నిజానికి తెలివితేటలు ఎవరి సొత్తు కాదు. వారసత్వంగా వచ్చేది అసలే కాదు. కేవలం సాధన, నేర్చుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటాయి. పుట్టిన బిడ్డ ఎలాంటి ఆలోచన తెలివి లేకుండా ఈ భూమి మీదకు వస్తాడు. కానీ తర్వాత తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తాను చూసిన సంఘటనలు, చదివిన పుస్తకాలు, నేర్చుకున్న విషయాలు, తల్లి తండ్రుల క్రమశిక్షణ, గురువుల శిక్షణ, పరిశీలించటం, మంచి చెడు తెలుసుకొని మెలగటం వంటి ఎన్నో కారణాలు తర్వాత జీవితంలో పిల్లలు ఉన్నత స్థాయికి రావడానికి కారణం అవుతాయి. సాధారణంగా వీటినే తెలివితేటలు అంటారు.

అయితే చాలామంది ఇవి కొందరిలో ఎక్కువగా ఉంటాయని మరికొందరిలో తక్కువగా ఉంటాయని భ్రమ పడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదని తెలుస్తోంది. అయితే స్వతహాగా కొందరిలో ఎక్కువగా ఉన్నప్పటికీ అవి అందుకోలేనంత స్థాయిని మించి ఉండవని పిల్లల్ని సక్రమంగా ఒక క్రమశిక్షణతో అన్ని తెలుపుతూ పెంచితే చక్కని వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటారని తెలుస్తోంది. అయితే పిల్లలు తెలివైన వారిగా ఉండటానికి కచ్చితంగా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

కృష్ణుడు రోజు ఆవు నెయ్యిని తిని అంత తెలివైన వాడిగా మారాడని పురాణాలే చెబుతున్నాయి. అందుకే కల్తీ లేని ఆవు నెయ్యి, వెన్న పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా పిల్లలు తెలివైన వారిగా ఎదగటానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఒకప్పటి రోజుల్లో ఆవు నెయ్యిని నిత్యం ఉపయోగించేవారు కానీ తర్వాత పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకుని ఆవు నెయ్యి, ఆవు పాలు వేడి చేస్తాయి అని అపోహలో బతికేస్తున్నారు. కానీ స్వచ్ఛమైన ఆవు పాలు, ఆవు నెయ్యి లో ఉండే పోషకాలు మరెందులోని ఉండవు. అందుకే పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు మొదటి ముద్దలోనే చెంచా స్వచ్ఛమైన ఆవు నెయ్యి, వాము కలిపి తినిపించాలి ఇలా చేయడం వల్ల వారు తెలివైన వారిగా ఎదుగుతారు. వీలైతే వెన్నను తినిపించడం కూడా మంచిదే.

వారానికి ఒక్కసారి అయినా నువ్వుల నూనెతో పిల్లల తలకి ఆరు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత చక్కగా తలనట్టు పోసి ధూపం వేయాలి. ఆ తర్వాత అన్నం, పాలు, నెయ్యి, బెల్లం తో చేసిన పాయసం పిల్లలకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఎంతో తెలివైన వారుగా మారుతారని మానసికంగా ప్రశాంతతను ఏర్పరచుకొని ఉన్నత జీవితాన్ని పొందటానికి మార్గం ఏర్పరుచుకుంటారని తెలుస్తోంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.