Cold bath : చలికాలంలో చన్నీటి స్నానమా..  ఈ విషయాలు తెలియాల్సిందే.. 

Cold water తో స్నానం చేయడం వల్ల రోజంతా ఎంతో చురుగ్గా ఉంటుంది అలాగే రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది ముఖ్యంగా చల్లటి నీటి స్నానం శరీరంలో డ్యూకో సైట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

Cold bath : చలికాలంలో చన్నీటి స్నానమా..  ఈ విషయాలు తెలియాల్సిందే.. 
Cold bath in winter


Cold bath in winter : ఈ winterలో ప్రతి ఒక్కరు హీటర్లు గీజర్లతోనే కాలం గడుపుతూ ఉంటారు అయితే వేడి నీటితో స్నానం చేసే కన్నా చాలా నీటితో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.. 

ఒకప్పటి కాలంలో కర్రల పొయ్యి పైన నీటిని మరిగించి వాటితో స్నానం చేసేవారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి విద్యుత్ అనుసంధానమై ఉంటుంది. అయితే ఇది శరీరానికి హాని చేస్తాయని తెలుస్తోంది. ప్రతి సందర్భంలో కాకపోయినా రోజు వీటినే ఉపయోగిస్తే ఎంతోకొంత ప్రమాదం తప్పదని తెలుస్తోంది. అయితే ఈ సమస్యలేవీ లేకుండా చల్లటి నీటితోనే రోజు స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. 

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా ఎంతో చురుగ్గా ఉంటుంది. అలాగే రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. ముఖ్యంగా చల్లటి నీటి స్నానం శరీరంలో డ్యూకో సైట్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇవి పలు రకాల ఇన్ఫెక్షన్లతో పోరాటటానికి సహాయపడతాయి. అందుకే చన్నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులకు రక్షణగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది..

అలాగే కండరాల నొప్పులకు కూడా మంచి ఉపశమనం. అలాగే తలకు స్నానం చేసినప్పుడు కూడా చల్లనీలతో చేయటం వల్ల జరిగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కొందరు చలిని తట్టుకోలేక చన్నీటి స్నానాన్ని దూరం పెడుతూ ఉంటారు. ఇలాంటి వారు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.. 

అలాగే డిప్రెషన్ తో ఉన్నవారు గోరువచ్చని నీటితో ఎక్కువసేపు తల స్నానం చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది. ఎంతటి ఒత్తిడి నుండి అయినా ఇది వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.  మెదడుకు సక్రమంగా రక్తప్రసరణ అందించడంలో కూడా ముందుంటుంది.. అలాగే నిద్రలేవగానే ఉంటే బద్ధకం అంతా చన్నీటి స్నానంతో ఒకసారిగా వదిలిపోతుంది...

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.