కీళ్లనొప్పులకు ఇది వాడితే...సమస్య మటుమాయం

మహాబీర విత్తనాలు గురించి మీకు తెలుసా. దాని వల్ల లాభాలు, ప్రయోజనాల జాబితా తెలుసా. ఇప్పుడున్న జీవనవిధానమెంటో.ఎవ్వరిదీ సరైన మార్గంలో లేదు. అలా చేస్తే బాగుంటుంది..ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటారే

కీళ్లనొప్పులకు ఇది వాడితే...సమస్య మటుమాయం


మహాబీర విత్తనాలు గురించి మీకు తెలుసా. దాని వల్ల లాభాలు, ప్రయోజనాల జాబితా తెలుసా. ఇప్పుడున్న జీవనవిధానమెంటో...... ఎవ్వరిదీ సరైన మార్గంలో లేదు. అలా చేస్తే బాగుంటుంది..ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటారే తప్ప ఆచరణలో పెట్టరు. దీనివల్ల ఆరోగ్యం కూడా సక్రమమైన మార్గంలో ఉండదు.

Joint Pain: కీళ్ల నొప్పుల కారణంగా ఊపిరితిత్తుల సమస్య రావొచ్చు.. ఎలానో  తెలుసుకోండి.. - Telugu News | Due to joint pain, many organs including  lungs are affected, know the preventive measures ...


అప్పట్లో ముసలివాళ్లకు మాత్రమే కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, మోకాళ్ల చిప్పలు అరిగిపోవడం వంటి సమస్యలు ఉండేవి. కానీ నేటి తరుణంలో చాలా మందికి కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు అందిరినీ బాధిస్తున్నాయి. ఏ చిన్న పనిచేసినా అది వేధించే బాధ అంతా ఇంతా కాదు. బిందెడు నీళ్లను మెట్లపై నుంచి మోసుకెళ్లడం కూడా పెద్ద ప్రహసనంగా మారింది. టపటపమని శబ్ధం వచ్చి....వెయ్యి సూదులతో గుచ్చితే ఎలాంటి నొప్పి వస్తుందో....అలా ఉంటుంది ఈ నొప్పి.

మారుతున్న జీవన విధానం, తినేతిండిలో సారం లేకపోవడమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. చాలా మంది ఇలాంటి నొప్పులు రాగానే ఏం చేస్తారంటే...వెంటనే నొప్పిని తగ్గించే మాత్రలు వేసేస్తూ ఉంటారు. అది అప్పటికి ఉపశమనం కలిగించినా...దీర్ఘకాల సమస్యను దూరం చేయదు. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయం.

కాబట్టి ఆయుర్వేదంలో కీళ్లనొప్పులకు, మోకాళ్లనొప్పులకు మంచి మంచి ఔషధాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దివ్యౌషధం....మహాబీర. దీన్ని వన తులసి అని కూడా అంటారు.

మహాబీర విత్తనాలు ఎలా వాడాలంటే...రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే కీళ్లు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మహాబీర నల్లనువ్వులు, సబ్జా గింజల్లాగా కనిపిస్తాయి. నల్ల రంగులో త్రిభుజాకారంలో ఉండే ఈ విత్తనాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఆ ఫలితం చూసి మీరే షాక్‌ అవుతారు.

Useful Tips For Arthritis Pains - Sakshi

క్రమం తప్పకుండా మహాబీర నానబెట్టిన నీళ్లను ౩ నెలలపాటు తాగితే మోకాళ్లలో అరిగిపోయిన మృదులాస్థి కణజాలం అదే కార్టిలేజ్‌ మళ్లీ ఉత్పత్తి అయి నొప్పులు తగ్గుతాయి. మహాబీర గింజలు ఆయుర్వేదిక్ దుకాణాల్లో దొరుకుతాయి.

వీటిని సబ్జా గింజల్లానే ఫలూదా, మజ్జిగ, సలాడ్లలో విరివిగా వాడుకోవచ్చు. ఈ గింజలు పేగుల్ని శుభ్రం చేస్తాయి. బరువును కూడా తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు, ఒత్తిడి... ఇలా ఎన్నో సమస్యల నివారణకూ ఇవి సాయపడతాయి.

మన శరీరంలో సరైన మోతాదులో నీరు లేకపోతే గుజ్జు తయారవ్వటం కష్టం. అందుకే ముందు జాగ్రత్తగా శరీరానికి నీటిని అందించాలి. ఈ గింజలను కూడా ఆహారంలో అలవాటు చేసుకోవాలి. కాల్షియం ఉండే పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయమేమిటంటే.....నిత్యం వాకింగ్‌ను మన లైఫ్‌ స్టైల్‌లో తప్పనిసరిగా పెట్టుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.