బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే!

బ్రెయిన్ ట్యూమర్.. సాధారణంగా దీన్నే బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. శరీరంలో ఏ భాగానికి అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో బ్రెయిన్ కి వస్తే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే అసలు బ్రెయిన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం.

బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే!


బ్రెయిన్ ట్యూమర్.. సాధారణంగా దీన్నే బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. శరీరంలో ఏ భాగానికి అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో బ్రెయిన్ కి వస్తే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే అసలు బ్రెయిన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం.
Brain Tumor: తలనొప్పి ఎక్కువ రావడం బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతమా? ఇది  క్యాన్సర్‌గా మారుతుందా? తెలుసుకోండి! - Telugu News | Is over headache a  sign for Brain Tumor can brain ...
సాధారణంగా ట్యూమర్ అంటే ఒక ప్రదేశంలో ఉండే కణాలు గతి తప్పి పెరగటం. ఇవి ఇలా పెరిగిపోతూ ఉండటం వల్ల ఆ ప్రదేశంలో ఉండే చుట్టూ ఉన్న మనిషి కణాలపై దాడి చేస్తూ ఉంటాయి. వాటిని నాశనం చేయడంతో పాటు శరీరంలో ఉండే శక్తినంత ఇవి పెరగడానికి తీసుకుంటూ ఉంటాయి. అలాగే శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని మొత్తం ఇవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ దాడి చేస్తుంది.
సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. వీటితోపాటు బయట నుంచి వచ్చే రేడియేషన్,  మారిపోతున్న జీవనశైలి, శరీరంలో హార్మోన్ల మార్పులు ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ కు కారణాలే.
ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ రావడానికి సెల్ ఫోన్ వాడకం కూడా కారణం అవుతుంది. ఫోన్ నుంచి ప్రమాదకరమైన రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఫోను వాడేటప్పుడు స్పీకర్ వాడటం నిద్రపోయే సమయంలో సైతం దూరంగా ఉంచటం మేలు.
 
కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిపై పురుగుల మందులు, రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి మెదడుపై ప్రభావం చూపి క్యాన్సర్ వచ్చే అవకాశానికి దారితీస్తాయి. 
నిత్యజీవితంలో ఆహారపు అలవాట్లు, నిద్రపోయే సమయం వంటివి కూడా బ్రెయిన్ ట్యూమర్ కు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, శ్రమ లేకపోవడం, కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే అజాగ్రత్త చేయడం వంటివి తీవ్రమైన సమస్యకు దారితీస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ను మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స తీసుకున్నాక ఎలాంటి సమస్య ఉండదు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.