Pongame oil tree : కానుగ చెట్టుతో పైల్స్‌, మలబద్ధకం, తామరకు చెక్‌.. పక్కనే ఉన్నా పట్టించుకోలేదుగా..!

Pongame oil tree : మన చుట్టూ ఉండే ఎన్నో రకాల వృక్షాలలో కానుగ చెట్టు ఒకటి.. దీన్ని మీరు చూసే ఉంటారు. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Pongame oil tree : కానుగ చెట్టుతో పైల్స్‌, మలబద్ధకం, తామరకు చెక్‌.. పక్కనే ఉన్నా పట్టించుకోలేదుగా..!
Benefits of Pongame oil tree


Pongame oil tree : ప్రకృతి మనకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఔషధాలను మొక్కలు రూపంలో ఇచ్చింది. ఈ భూమ్మీద ఉండే ప్రతి చెట్టు మనకు ఏదో సమాధానం ఇస్తుంది. కాకపోతే మనకే ఆ విషయం తెలియదు.  మన చుట్టూ ఉండే ఎన్నో రకాల వృక్షాలలో కానుగ చెట్టు ఒకటి.. దీన్ని మీరు చూసే ఉంటారు. రోడ్ల పక్కన కూడా కానుగ చెట్లు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

కానుగ చెట్టు వల్ల ఉపయోగాలు..

కానుగ చెట్టు ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే గ్యాస్‌, అసిడిటీ, కడుపులో నొప్పి, మలబద్దకం, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు కూడా తగ్గుతాయి. బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
బాగా వేడిగా ఉండే గంజిలో కానుగ ఆకులను ఒకటి రెండు వేయాలి. కొంత సేపు ఉంచి ఆకులను తీసేసి.. ఆ గంజిని తాగాలి. ఇలా తాగడం వల్ల వాంతులు తగ్గిపోతాయి.

కానుగ చెట్టుకు బాదం కాయల్లాగే కాయలు కాస్తాయి. ఆ కాయల లోపల విత్తనాలు ఉంటాయి. ఇవి తినొచ్చు. ఆరోగ్యానికి మంచిది.
గాయాలు అయినప్పుడు కానుగ గింజలను మెత్తగా నూరి తేనె లేదా నెయ్యి లేదా చక్కెర ఏదో ఒక దానితో కలిపి తీసుకోవడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. గాయాలు త్వరగా మానుతాయి.
కానుగ వేర్లను సేకరించి శుభ్రం చేసి ఎండబెట్టి.. పొడిలా చేసి.. కొద్దిగా తీసుకుని అందులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. అనంతరం దాన్ని గడ్డలపై రాసి కట్టులా కట్టాలి. దీంతో గడ్డలు త్వరగా పగిలిపోతాయి. అందులో ఉండే చీము త్వరగా బయటకు వస్తుంది..
పైల్స్‌ సమస్య ఉన్నవారికి కానుగ చెట్టు బెరడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ బెరడును నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని మొలలపై రాస్తుండాలి. దీంతో మొలలు తగ్గిపోతాయి.
కానుగ గింజల నుంచి తీసే నూనె కూడా మనకు ఉపయోగపడుతుంది. దేవుడికి దీపాలకు పెట్టే నూనెకు బదులుగా కానుగ నూనెను వాడవచ్చు. దీంతో ఆ నూనె కాలడం వల్ల వచ్చే వాసనకు చుట్టూ ఉండే సూక్ష్మ జీవులు నశిస్తాయి. గాలి శుభ్రమవుతుంది.
కానుగ నూనెను రాస్తుంటే గజ్జి, తెల్ల మచ్చలు, తామర వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఈ నూనెను కొద్దిగా వేడి చేసి ఛాతిపై రాస్తే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి.
కానుగ చెట్టు పుల్లలతోనూ నోరు, దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇవి కూడా దంతాలను తోముకునేందుకు చక్కగా పనిచేస్తాయి. వీటితో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయి. నోట్లో ఉండే పొక్కులు, పుండ్లు తగ్గుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.