రొమ్ము క్యాన్సర్ ను సకాలంలో ఎలా గుర్తించాలో తెలుసా.. !

రొమ్ము క్యాన్సర్ ఉంటే రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్ ఉంటాయి.. అలాగే రొమ్ములు బాగా ఎరుపెక్కడం..  చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, రొమ్ముల్లో గడ్డలు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి..

రొమ్ము క్యాన్సర్ ను సకాలంలో ఎలా గుర్తించాలో తెలుసా.. !
Detect breast cancer in early stages


ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం ఒకప్పుడు ఈ మాట వింటేనే ఎంతగానో భయపడిపోయేవారు.. కానీ ప్రస్తుతం చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది ఈ వ్యాధి.. ఇందులో ముఖ్యంగా మహిళలకు వచ్చే breast cancer తో ప్రాణానికి కూడా ప్రమాదం తప్పదు.

అయితే ఎలాంటిది సమస్య అయినా సకాలంలో గుర్తిస్తే సగం పరిష్కారం చేయవచ్చు అంటున్నారు నిపుణులు.  అందుకుగాను బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. 

తాజాగా జరిగిన ఎన్నో అధ్యయనాలు డేటా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలమంది క్యాన్సర్ తో చనిపోతున్నారని తెలుపుతున్నాయి..  2020 డేటా ప్రకారం, క్యాన్సర్ వల్ల దాదాపు 10 మిలియన్ల మంది మరణిస్తుంటే.. అందులో 2.26 మిలియన్ మంది రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.. ఇంత భయంకరమైన వ్యాధిని కూడా సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు అని తెలుస్తోంది.. అయితే ఇందులో ఉండే లక్షణాలు ఏంటంటే.. 

డక్టల్ కార్సినోమా అనేది రొమ్ము క్యాన్సర్‌లో అత్యంత సాధారణ రకం. ఈ రకమైన క్యాన్సర్ మీ రొమ్ములోని పాల వాహిక యొక్క
లైనింగ్‌లో ఏర్పడుతుంది. నాళాలు తల్లి పాలను లోబుల్స్ నుండి చనుమొన వరకు తీసుకువెళతాయి.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉంటే రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్ ఉంటాయి.. అలాగే రొమ్ములు బాగా ఎరుపెక్కడం..  చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, రొమ్ముల్లో గడ్డలు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.. అలాగే రొమ్ముల్లో నొప్పి, చనుమొనల్లో నొప్పి, చనుమొనలు లోపలివైపునకు కుంగినట్లుగా అయిపోతాయి.. వీటిని సాధారణంగా మన ఇంట్లోనే పరీక్షించి తెలుసుకోవచ్చు ఒకసారిగా రొమ్ములు ఎలాంటి తేడా వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.. సకాలంలో వైద్యులను సంప్రదిస్తే.. క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది... బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో విజయవంతంగా పోరాడటానికి, దానిని ముందుగా గుర్తించడం చాలా అవసరం.. అలాగే ఈ వ్యాధిలో కీమోథెరపీ ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని అందరికీ తెలిసినప్పటికీ.. సర్జరీ, బయోలాజికల్, హార్మోన్ థెరపీ, రేడియేషన్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.