పీరియడ్స్ టైమ్ లో అమ్మాయిలు ఎక్కువగా చేసే తప్పులు ఇవే.. ఎంత డేంజరో తెలుసా?

ప్రతి అమ్మాయి ప్రతి నెల పేస్ చేసే సమస్య పీరియడ్స్.. నెలా వచ్చే రుతుక్రమం ప్రతి మహిళ జీవితంలో ఓ భాగం అయినప్పటికీ.. ఇప్పటికీ దాని చుట్టూ ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి..రుతుక్రమం సమయంలో పరిశుభ్రంగా ఉండటం చాలా అవసరం. కానీ కొందరు మహిళలు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు

పీరియడ్స్ టైమ్ లో అమ్మాయిలు ఎక్కువగా చేసే తప్పులు ఇవే.. ఎంత డేంజరో తెలుసా?


ప్రతి అమ్మాయి ప్రతి నెల పేస్ చేసే సమస్య పీరియడ్స్.. నెలా వచ్చే రుతుక్రమం ప్రతి మహిళ జీవితంలో ఓ భాగం అయినప్పటికీ.. ఇప్పటికీ దాని చుట్టూ ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి..రుతుక్రమం సమయంలో పరిశుభ్రంగా ఉండటం చాలా అవసరం. కానీ కొందరు మహిళలు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.పీరియడ్స్ సమయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పరిశుభ్రంగా ఉండాల్సిన ఈ సమయంలో లేనిపోని అనుమానాలు, అపోహలతో సమస్యలు కొనితెచ్చుకుంటారు. పీరియడ్స్ సమయంలో సాధారణంగా జరిగే పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
When is a heavy period too heavy? - Harvard Health
సెంటెడ్ శానిటరీ ప్యాడ్స్ వల్ల లాభాల కంటే సమస్యలే ఎక్కువ. పీరియడ్స్ వేళ సాధారణ ప్యాడ్స్ వాడటమే మేలు. పీరియడ్ బ్లీడింగ్ చికాకుగా ఉందని కొందరు సెంటెడ్ ప్యాడ్స్ వాడటం వల్ల ఇతర సమస్యలు వస్తాయి. సెంటెడ్ శానిటరీ ప్యాడ్లను వాడటం వల్ల యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులోని రసాయనాలు చికాకును, దురదను, వాపును కలిగిస్తాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతాయి.. ఫ్యాడ్స్ వాడే విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మేలు.. ఇకపోతే కొంత మంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో స్నానం చేయకుండా ఉంటారు. అలసట, నొప్పి లాంటి కారణాల వల్ల కొంత మంది స్నానం చేయరు. పీరియడ్స్ వేళ వచ్చే బ్లీడింగ్ ను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. స్నానం చేయకపోతే యోని ప్రాంతంలో మరింత చికాకుగా ఉంటుంది. అందుకే రోజుకొకసారి తప్పకుండా వీలైతే రెండు సార్లు స్నానం చేయాలి..
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేస్తే గర్భం ధరించరని కొంత మందిలో అపోహ ఉంటుంది. కానీ రుతుక్రమంలో సెక్స్ చేయడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావొచ్చు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే బ్లీడింగ్ అవుతున్నప్పుడు సెక్స్ అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే సెక్స్ కు ముందు యోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే సెక్స్ తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలి.. వీలైతే కండోమ్ ను ధరించడం మేలు... అప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి..ఇకపోతే క్లీన్ చేసుకోవడానికి నీళ్లను ఎక్కువగా వాడితేనే మంచిది.. ఇది గుర్తుంచుకోండి...
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.